భారతీయ జనతా పార్టీ గెలుపుకు సంబంధించి ఒక మంచి అబ్జర్వేషన్.. మతం, ఈవీఎం లే బిజెపిని హర్యానాలో గెలిపించాయి అనుకుంటే.. అది వెర్రితనం. వాస్తవంగా బిజెపికి జాట్స్ ఓట్లు రావని పసిపిల్లాడికి కూడా తెలుసు.. అందుకే ఎలక్షన్స్ వన్ ఇయర్ సమయం ఉన్న సమయంలో బీసీలను సీఎం చేశారు. వెంటనే కొత్త సీఎం రాగానే ఓబీసీ రిజర్వేషన్ 17 నుంచి 27% వరకు పెంచేశారు.. దీంతో యాదవ, సైనిస్ కమ్యూనిటీ ఓట్లు మెజారిటీతో బిజెపి కైవసం చేసుకున్నది.


దీంతో ఎస్సీ కమ్యూనిటీ నుంచి.. చీల్చేస్తూ ఎస్సి సబ్ కాస్ట్ గా తీసుకొస్తూ రెండు భాగాలుగా చేశారు. డిప్రైవ్డ్ షెడ్యూల్ క్యాస్ట్..SC అని,అధర్ షెడ్యూల్ క్యాస్ట్ OSC తెలివిగా చమరు వేరే కులాలను విడదీశారు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇది పాస్ చేయడం కుదరలేదట. ఎస్సీలకున్న రిజర్వేషన్ 20% సీట్లలో సగం సీట్లలో ఓఎస్సీ కింద చబర్ కులానికి ఇచ్చేశారు. దీంతో మిగిలిన 36% రిజర్వేషన్ల లోని సీట్లను ఇతర కులాల వరకు బిజెపి తెలివిగా ఇచ్చిందట. దీంతో దళిత ఓట్లన్నీ కూడా బిఎస్సి పార్టీని కాదని బిజెపి పార్టీకి పడ్డాయట.



ఇక ఆ తర్వాత ఈ డబ్ల్యూ ఎస్ కోట కింద ఉన్నటువంటి ఓట్లు బ్రాహ్మణ ఓట్లు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు అన్ని కూడా బిజెపి పార్టీకి పడ్డాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం జాట్స్ ఓట్ల వెంటపడి మిగిలిన వారి ఓట్లను వదిలిపెట్టేసింది. అయితే వీరు ఉన్నది కేవలం 25 నుంచి 28% మాత్రమే.. అయితే ఇది సీఎం సీటు వచ్చేలా చేయదు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోయింది. అలాగే జాట్స్, ముస్లిం ఓట్లు ఇద్దరు కూడా ఒకే చోట ఉండడంతో అక్కడ ఎస్సి ఓట్లు పక్కకి వెళ్లిపోయాయట. అందుకే కొన్నిచోట్ల 30 వేల మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ మిగతా చోట్ల గెలవలేకపోయింది. ఓబిసి ,ఎస్సి కోట్ల లాగడం కోసం Rss అనేది 16 వేల మీటింగులు పెట్టారనేది కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి: