- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . .

రాజకీయాలకు ఎప్పుడు ఎలా మారుతాయో ? ఎవరికీ తెలియదు.. ఒక్కోసారి ఎవరైనా ఇబ్బందుల్లో పడితే సొంత పార్టీ నేత‌ల నుంచే అసలు సపోర్టు ఉండదు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా ఒంటరిగా కనబడుతున్నారు. సాధారణంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దూకుడు తక్కువ. అందుకే వేరే పార్టీలో ఉన్న మాస్ లీడర్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం రెడ్ కార్పెట్ వేసి మరి పిసిసి అధ్యక్ష పగ్గాలు ఇచ్చి పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిని చేసింది. సీనియర్లకు కోపం వచ్చిన రేవంత్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల లో ఉత్సాహం పెరిగింది. 2018 లో మిస్ అయిన 2023లో గురు పెట్టి కొట్టి కేసీఆర్ను గద్దె దించి అధికారం చేపట్టింది.


తెలంగాణ కాంగ్రెస్లో పదేళ్ల తర్వాత విజయం సాధించి అధికారం రావడంలో రేవంత్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లకు చాలావరకు నచ్చలేదు. కోమ‌టిరెడ్డి వెంకట రెడ్డి -  ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఎందుకో సైలెంట్ అయ్యారు. పొంగులేటి మాస్ లీడర్ అయినా ఆయన మాటల్లో దూకుడు తక్కువ .. శ్రీథ‌ర్ బాబు - పొన్నం ప్రభాకర్ లాంటి నేతలకు ప్రజల్లో ఆదరణ ఉన్నా వారు మాస్ లీడర్లు కారు. సీతక్క అప్పుడప్పుడు ఘాటుగా మాట్లాడిన ఆమె ఓ పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు.


ఇక ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క - వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే రేవంత్ క్యాబినెట్లో దూకుడుగా ఉన్నా ...  వాళ్ళు ఎక్కువగా తమ జిల్లా పరిధి వరకు పరిమితం అవుతున్న పరిస్థితి. తాజాగా కొండా సురేఖ కోపంలో సమంత - నాగార్జున - కేటీఆర్ మీద విసిరిన మాటలు బాణాలు తిరిగి ఆమెకే తగులుతున్నాయి. ఇండస్ట్రీ అంతా ఆమె తీరుపై విమర్శలు చేసింది. ఇలాంటి టైం లో కొండా సురేఖ తన మాటలు వెనక్కి తీసుకున్న ఎందుకో ఆమెకు అనుకున్న స్థాయిలో సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: