ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రతన్ టాటా ఒక పెను విప్లవానికి దారి తీశారు. రతన్ టాటా ఆలోచనలతో అందుబాటులోకి వచ్చిన ఎన్నో వాహనాలు మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. అవి ప్రజల జీవితాలను సులభతరం చేశాయి. టాటా తర్వాత మళ్లీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎలాన్‌ మస్క్. టెస్లా కంపెనీ స్థాపించి ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేస్తూ ఆయన ఫుల్ ఫేమస్ అయ్యారు ఆయన కార్ల వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఆయన ఎలక్ట్రిక్ కార్లు తీసుకురావడం వల్ల రతన్ కూడా ఇండియాలో ఎలక్ట్రికల్ తీసుకొచ్చారు. మొత్తం ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల మయం అయింది.


 ఒకసారి ఎలాంటి మస్క్ ను రతన్ టాటా తీసుకొచ్చిన నానో టాటా గురించి అడిగారు. 2009లో, ప్రముఖ టీవీ ప్రెజెంటర్ చార్లీ రోస్‌ చేసిన ఇంటర్వ్యూలో, టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్, టాటా గ్రూప్‌ చైర్మన్ రతన్ ఇన్నోవేటివ్ మైండ్‌ను ఎంతగానో మెచ్చుకున్నారు. ముఖ్యంగా, లక్షల మంది భారతీయులు కారును కొనుగోలు చేయగలిగేలా తయారు చేసిన టాటా టాటా నానో ఐడియాని గురించి ప్రశంసలు కురిపించారు.

"అందరికీ కారు అనేది చాలా మంచి ఆలోచన. టాటా నానో అనేది అద్భుతమైన కారు. రతన్ టాటా చాలా తెలివైన వ్యక్తి" అని ఎలాన్ మస్క్ అన్నారు. మారుతున్న కారు పరిశ్రమలో రతన్ టాటా గారి దూరదృష్టిని ఆయన ఎంతగానో అభినందించారు. అయితే, నానో కారు ముందు భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. "పెట్రోల్ ధరలు పెరిగితే, కారు కొనుగోలు చేసే ఖర్చు కంటే దాన్ని నడిపించే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. అది నానో కారుకు పెద్ద సవాలు" అని ఆయన చెప్పారు.

చీపెస్ట్ కార్ అనేదే ఒక తప్పుడు నిర్ణయం అని ఆయన ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. ఒక పేదవాడు డబ్బులు వెనకేసుకొని లక్ష రూపాయలతో కారు కొనగలుగుతాడు. కానీ పెట్రోల్ ఖర్చులు భగ్గుమంటున్న వేళ ఆ పేదవాడు దాన్ని నడపగలడా? టోల్ టాక్స్ లు, పెట్రోల్ ఖర్చులు భరించే పరిస్థితి పేదవాడికి లేదు. కార్ అంటేనే మెయింటినెన్స్ ఖర్చుతో కూడుకున్నది. దాన్ని కొన్నంత మాత్రాన సంబరం కాదు ఈ విషయాన్ని ఎలాన్‌ మస్క్ స్పష్టంగా తెలియజేశారు.

2008లో, ప్రపంచంలోనే అతి తక్కువ ధర కలిగిన కారుగా టాటా నానోను మిడిల్ క్లాస్ పీపుల్ కోసం ప్రవేశపెట్టారు. కానీ, ఇది చీపెస్ట్ కార్ అనే ఒక నెగటివ్ ఇమేజ్‌ను మూటగట్టుకుంది. అలాగే కారులో కొన్ని సమస్యలు ఉన్నాయని తెలియడం వల్ల ఈ కారు అంతగా ప్రజాదరణ పొందలేదు. ఉదాహరణకు, కొన్ని కార్లు మంటలు అంటుకున్నాయనే వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో కారు అందించాలని రతన్ టాటా చేసిన ఆలోచన చాలామంది ప్రశంసలు అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: