జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత... నిత్యం వార్తలో నిలుస్తున్నారు. ముఖ్యంగా హిందూ వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి... చంద్రబాబు కంటే ఎక్కువగా... మీడియాలో హైలెట్ అవుతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కడపలో.. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థలం కొనుగోలు చేశాడు.


అయితే ఆయన సొంత అవసరాలకు కాకుండా అక్కడి  విద్యార్థుల కోసం సహాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు... పవన్ కళ్యాణ్ ఈ దిశగా అడుగులు వేశారు. కడప జిల్లా మైసూర్ వారి పల్లి లో ప్రభుత్వ పాఠశాల కోసం క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా దాదాపు కోటి రూపాయల సొంత నిధులతో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్.


మైసూర్ వారి పల్లి పంచాయతీ పేరుతో క్రీడ మైదానానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు పవన్ కళ్యాణ్. గతంలో చంద్రబాబు నాయుడు... ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్... తన సొంత నిధులతో... అమలు చేశారు. దాదాపు ఎకరం  కొనుగోలు చేసి పిల్లలకు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయించి ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు ఇంకా చేయాలని కోరుతున్నారు.


ఇది ఇలా ఉండగా...  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి 100కు 100% స్ట్రైక్ రేట్ వచ్చిన సంగతి తెలిసిందే.  పోటీ చేసిన ఎంపీ అలాగే ఎమ్మెల్యే స్థానాలలో వైసిపి గెలవడం జరిగింది. అలాగే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ముగ్గురికి మంత్రి పదవులు వచ్చాయి. ఏపీ డిప్యూటీ మంత్రితోపాటు మరో నాలుగు శాఖలు పవన్ కళ్యాణ్ కు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అలాగే...నాందెడ్ల, కందుల దుర్గేష్‌ కు కూడా పదవులు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: