హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బిజెపి పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ ఫలితాలు అలాగే సర్వే రిపోర్ట్ లన్ని... కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పగా... ఎన్నికల ఫలితాలు మాత్రం... సీన్ రివర్స్ చేశాయి. హర్యాన రాష్ట్రంలో బిజెపి పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే... హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి తెలంగాణ నేతలు కొంతమంది కారణమని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


సరిగ్గా హర్యానా రాష్ట్రంలో..  అక్టోబర్ 5వ తేదీన చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దానికంటే ముందు సెప్టెంబర్ 27వ తేదీన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు... దాడులు చేసిన సంగతి మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సందర్భంగా భారీ మొత్తంలో డబ్బు దొరికిందని.. మీడియాలో వార్తలు వచ్చాయి. కాష్ మెషిన్లను కూడా అధికారులు.. పొంగి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్లారు.


కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో..  ఎన్ని కోట్లు దొరికాయి? ఆయన ఏ స్కామ్ చేశాడు? అనే విషయాలను మాత్రం ఈడి అధికారులు వెల్లడించలేదు. ఇలా దాడులు చేసినప్పుడు కచ్చితంగా ఈ డి ఒక ప్రకటన చేస్తుంది. కానీ పొంగులేటి శ్రీనివాస్ విషయంలో అలా జరగలేదు. అయితే ఆయన ఇంట్లో డబ్బు ఉందని కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు.. బిజెపికి సమాచారం ఇచ్చారట.  పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఉన్న డబ్బును హరియానకు తరలించేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేసిందట.

అయితే ఆ డబ్బును అక్కడే ఆపేందుకు... ఈడిని బిజెపి ప్రయోగించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తెలంగాణలో ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, సునీల్ కనుగోలు  అని సమాచారం అందుతుంది.  అయితే హర్యానా ఎన్నికల కంటే ముందు ఈ డబ్బు పట్టుబడడంతో... అక్కడ బిజెపి గెలిచిందని చెబుతున్నారు. అదే డబ్బు హర్యానాకు చేరుంటే కాంగ్రెస్ గెలిచేదని అంటున్నారు. అంతేకాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదాని అటు సునీల్ కనుగోలు... ముగ్గురి ఇటీవల సమావేశం కూడా దీని గురించే జరిగిందట. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: