బిజినెస్‌ టైకూన్, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మన మధ్య లేకున్నా..తన మంచితనంతో అందరి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి.భావితరాలకు స్ఫూర్తి. వ్యాపారా సామ్రాజ్యంలో పారిశ్రామిక వేత్తలకు గురువు. వ్యక్తిత్వ పరంగా విద్యార్థులకు, యువతకు ఆదర్శం ఆయన.టాటా వ్యాపారంలో నైతిక విలువలకు పెద్దపీట వేశారు. కష్టమైన వ్యాపార నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు కూడా నిజాయితీ విషయంలో రాజీ పడేందుకు నిరాకరించారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. కఠిన పరిస్థితులు ఎదురైన మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకుండా వ్యవహరించడం అనేది అత్యంత గొప్ప విషయం. ఇది విశ్వసనీయతకు నిదర్శనం. అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది అనేందుకు టాటానే నిదర్శనం. ఇదిలావుండగా టాటా గ్రూప్ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పట్టులోకి తీసుకురావాలన్నది రతన్ టాటా చిరకాల కోరిక. ఇందుకు అడ్డంకులు ఎదురవడంతో సింగపూర్ ఎయిర్ లైన్స్, మలేషియా ఎయిర్ లైన్స్ తో కలిసి విమానయాన రంగంలోకి ప్రవేశించారు.ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే, ఈ సంస్థ నష్టాల్లో ఉందని.. భారత ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థా ముందుకు రాలేదు. అయినా తమ గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను మళ్లీ తమ ఆధీనంలోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్ ఇండియాను రతన్ టాటా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ సంస్థ అన్ని బాలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది. అయితే, ఇప్పుడే నష్టాల నుంచి ఒడ్డున పడుతూ.. లాభాల దిశగా అడుగులు వేస్తున్న ఎయిర్ ఇండియా పూర్తి లాభాలు చూడకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. దీన్ని లాభాల బాటలో పెట్టాలని.. సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతో విమానం ఎక్కాలన్నది ఆయన కోరికగా ఉండేది.అది తీరకుండానే కాలం చెల్లించారు. ఇదిలావుండగా అసలు మన దేశంలో మొదటి సారిగా విమానాల కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న ఎయిర్ లైన్స్ మొదట టాటా ఎయిర్ లైన్స్ గా ఉండేది. ఇదిలావుంటే ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు అయిన టాటా నానో లాంచ్ వంటి వినూత్న ఆలోచనలకు రతన్ టాటా పేరుగాంచారు. మధ్యతరగతి భారతీయులు కూడా కారు కొనుక్కో గలిగేలా చేయడమే ఈ కారు లక్ష్యం. ఇక్కడ టాటా ఫార్వర్డ్-థింకింగ్, రిస్క్ తీసుకేనే ధైర్యం మనకు కనిపిస్తున్నాయి. అవసరమనుకుంటే రిస్క్‌ తీసుకోవాలి.

ఒకవేళ ఫెయిలైన ఒక మంచి అనుభవం లభించడమే గాక సృజనాత్మకంగా ఆలోచించేందకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే అందులో ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లే సామార్థ్యం పెరుగుతుంది.

చివరి వరకు ఆయన జీవితాన్ని చాలా అపరూపంగా తీర్చిదిద్దుకున్నారు. అంతేగాదు మరణం సమీపించే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేవారని సన్నిహిత వర్గాల సమాచారం. కెరీర్‌ని, వ్యక్తిగత జీవితాన్ని ఎలా మమేకం చేసుకోవాలో ఆచరించి చూపిన వ్యక్తి టాటా.

మరింత సమాచారం తెలుసుకోండి: