ఈ క్రమంలో తాజాగా, సికింద్రాబాద్ వద్ద ఓ కండక్టర్ మహిళల వద్ద ఛార్జీ వసూలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్యాట్నీ సెంటర్ వద్ద ఆరుగురు మహిళలు సంగీత్ వరకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. అయితే ఆధార్ కార్డు చూపించమని కండక్టర్ అడగ్గా వారు అధికారులు ఏ కార్డ్ లేకున్నా ప్రయాణించవచ్చని చెబుతుంటే మీరు కార్డు అడుగుతున్నారా అని అనగా.. కండక్టర్ కోపంతో వారికి మనిషికి రూ.10 చొప్పున టికెట్ ఇచ్చాడు. టికెట్‌కు డబ్బులు ఇవ్వం అంటే వెకిలిచేష్టలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో వారు డబ్బులు చెల్లించి.. టికెట్ తీసుకుని సజ్జనార్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పి సంగీత్ వద్ద దిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటన తెలిసిన మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.