తెలంగాణ రాష్ట్రంలో.. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వివాదంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి... అనుకూలంగా ఉన్న అధికారులను మార్చేసేందుకు.. రెడీ అయింది కేంద్ర సర్కార్. ఇందులో భాగంగానే చాలామంది ఐఏఎస్ అధికారులను మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేసినా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.



స్థానికత ఆధారంగా కొంతమంది అధికారులను... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే తెలంగాణ క్యాడర్ కావాలనుకున్న 11 మంది ఐఏఎస్ అధికారులను... వారి విజ్ఞప్తులను మోడీ ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది. ఈ 11 మంది ఐఏఎస్ అధికారులు వెంటనే తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేయాలని కూడా కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సోమవారం లోపు ఈ అధికారులంతా తమ రాష్ట్రాలకు వెళ్లిపోవాలని కూడా సూచనలు చేసింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.


అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే...  ఈ 11 మంది జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి  కూడా ఉండడం గమనార్హం. ఆమె ఇటీవల... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత... అమ్రపాలికి ప్రాధాన్యత పెరిగిన సంగతి తెలిసిందే.


పొద్దున లేస్తే చాలు రేవంత్ రెడ్డి కంటే మీడియాలో ఎక్కువగా ఆమ్రపాలి కనిపిస్తున్నారు. అయితే అలాంటి ఆమ్రపాలిని... ఏపీకి వెళ్లిపోవాలని కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవంగా ఆమ్రపాలిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఆమె ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ లో స్థానికత ఆంధ్ర ప్రదేశ్ ఉంది. అందుకే ఆమె ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి... ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంటుంది. ఆమెతో పాటు తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శి  రోనాల్డ్ రోస్ కూడా... ఏపీకి వెళ్లి పోవాల్సిందిగా కోరింది కేంద్ర ప్రభుత్వం. మరి దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: