1). పామాయిల్-850 grames -110 రూపాయలు
2). సన్ఫ్లవర్ ఆయిల్-950 గ్రామ్స్-124 రూపాయలు చొప్పున అమ్మేలా పౌరసరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అయితే ఈ పద్ధతి ఈనెల ఆఖరి వరకు కొనసాగుతుంది అంటూ తెలియజేశారు. అయితే ఒక్కో రేషన్ కార్డుదారు పైన కేవలం ఒక లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే మూడు లీటర్ల పామ్ ఆయిల్ ని మాత్రమే ఇచ్చేలా నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలియజేశారు. పండుగలు వేల ప్రజలకు సైతం ఈ ధరలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. పండుగలు వేల అధిక ధరల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆలోచనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి రోజున పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులతో చర్యలు జరిపి ఇలా ప్రతినిధులతో ధరల నియంత్రణ పైన చర్చించిన తర్వాతే రాష్ట్రమంతటా కూడా ఇలా ఒకే రకంగా ధరలు ఉండాలనే విధంగా అధికారులు షాపుల యజమానులకు నిర్ణయాలను అమలు చేసేలా జీవోను కూడా జారీ చేశారట. ఇప్పటికే వంట సరుకులతో పాటు నిత్యవసర సరుకులు, కాయగూరలు వంటివి భారీగా ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారట. అందుకే సామాన్య ప్రజలకు కూడా భారం పడకూడదని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతలతో మాట్లాడి ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.