టాటా సన్స్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా (86) బుధవారం కన్నుమూశారు. అయితే ఆయన మృతి పై దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక ఆయన మరణ వార్త విని వ్యాపార దిగ్గజాలు మాత్రమే కాదు సినీ రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియా ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది అంటూ ఇక ప్రతి ఒక్కరి హృదయం ఉక్కిరిబిక్కిరి అయింది. ఎందుకంటే ఆయన కేవలం విజయవంతమైన వ్యాపారపేత మాత్రమే కాదు పరోపకారి, మూగజీవాల ప్రేమికుడు కూడా. సంపాదన సృష్టించడం మాత్రమే ఎంతో మంది వ్యాపారవేతలకు తెలుసు. కానీ రతన్ టాటా ఇక సృష్టించిన సంపదలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గొప్ప మహానయుడిగా ఎదిగారు.



 పేద మధ్యతరగతి ప్రజల కోరికను తీర్చేందుకు నానో అనే ఒక గొప్ప ఆలోచన చేసి అందరి హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే రతన్ టాటా ఇటీవల తుది శ్వాస విడవడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే వేల కోట్ల ఆస్తులు ఉన్న రతన్ టాటా ఇక ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడేవారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. రతన్ టాటా పార్సి కమ్యూనిటీకి చెందినవారు. అందుకే తన కమ్యూనిటీకి చెందిన ఆహారం తినడానికి ఎక్కువగా ఇష్టపడేవారట.


 అంతేకాకుండా ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారట రతన్ టాటా. ఇక తన సోదరి చేసే వంటకాలను అయితే ఎంతో ఇష్టంగా తినే వారట. రతన్ టాటా ను తన వంటకలతో ఆకట్టుకున్న మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే ప్రముఖ పార్సి చెఫ్ పర్వేజ్ పటేల్. పర్వేజ్ కి టాటా పరిశ్రమలతో దీర్ఘకాల అనుబంధం ఉంది. అంతేకాకుండా ఆయన రతన్ టాటాకు ఇష్టమైన చెఫ్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. ఒకానొక సందర్భంలో రతన్ టాటాకు హోమ్ స్టైల్ పార్సి వంటకాలు ఎంతో ఇష్టమని. కట్ట మీటా మసూర్ దాల్, మటన్ పులావ్ పప్ప, ఐకానిక్ నాట్ రీచ్ బేక్డ్ సీతాఫలం లాంటివి రతన్ టాటా ఫేవరెట్ ఫుడ్స్ అంటూ పర్వేజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: