- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

ఎన్నికలలో విజయం సాధించాలి అంటే ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటే చాలు అన్నది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పని. ఇలా కోట్లకు కోట్లు పార్టీ తరఫున అధికారికంగా వైట్ మనీ ఖర్చు పెట్టారు అంటే ... ఇక బ్లాక్ మనీ ఎంత ఖర్చు పెట్టి ఉండాలి .. ప్రజాధనంతో ఇచ్చిన ప్రకటనలు ప్రచార ఖర్చు ఎంత ఉండాలి ? అని ఆలోచిస్తే ఊహకు అందని విధంగా లెక్కలు ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 16 నుంచి ఫలితాలు వచ్చిన జూన్ 6వ తేదీ వరకు చేసిన ఖర్చులను వైసిపి ఎన్నికల సంఘానికి సమర్పించింది. అందులో తమ మీడియా సంస్థల కోసం ఏకంగా రు. 87 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది.


షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఏపీలో పోలింగ్ జరిగే వరకు రెండు నెలల గ‌డువ‌ ఉంది. పోలింగ్ తర్వాత ఎలాంటి ప్రకటనలు లేవు. ఈ 60 రోజులలో ఏకంగా రు. 87 కోట్ల రూపాయలకు పైగా మీడియా సంస్థలకు చెల్లించారు. ఇందులో టీవీ 9 - 10 టీవీ - ఎన్టీవీ లకు అత్యధిక భాగం ఇచ్చారు. అలాగే సినిమా ధియేటర్లలో యాడ్స్ కోసం క్యూబ్ - యూఎఫ్ వో లాంటి సంస్థలకు కూడా కోట్లలో చెల్లింపులు చేశారు. ఇక ఐ డ్రీం - సాక్షికి కూడా చెల్లింపులు చేశారు. ఇదంతా అధికారికంగా పైన చెప్పుకుంది .. ఎన్నికల షెడ్యూలు వచ్చాక పోలింగ్ మోగిసే వరకు చేసిన అధికారిక ఖర్చు కానీ షెడ్యూల్ రావడానికి ముందుగా విచ్చ‌ల విడిగా డ‌బ్బు పంచుతూ యూట్యూబ్ ఛానల్స్‌ను .. ఫెయిడ్ జ‌ర్న‌లిస్టు ల‌ను పెంచి పోషించింది.


మాజీ ఏబీఎన్ జర్నలిస్టు ఒకరికి .. అత‌డు బ‌య‌ట‌కు వ‌చ్చి ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నారు. అత‌డికి ఏడాది కనీసం కోటిముట్టి ఉంటాయి. ఓ మహిళ యాంకర్ నడిపే ఛానల్ దగ్గర నుంచి మీమ్స్‌ పేజీల వరకు ప్రతి ఒక్కరికి ఏడాది పాటు ప్రతి నెల నెలా లక్షలు చెల్లించేవారు. ఇది మొత్తం అన‌ధి కారిక‌కంగా 400 నుంచి 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి: