తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కొంతమంది లేడీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఆంధ్రాకి బదిలీ కావడానికి ఆసక్తి చూపించడం లేదు. ఆంధ్రాకి వచ్చే ఇంట్రెస్ట్ లేదు కాబట్టే వారు తమను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT)కు అభ్యర్థనాలు చేశారు. మరి కొంతమంది ఏమో ఆంధ్రప్రదేశ్‌లోనే తమను ఉంచాలంటూ కోరారు. ఈ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యర్థనలను DoPT తిరస్కరించింది. ఈ అధికారులు తమకు ముందుగా కేటాయించిన రాష్ట్రాల్లోనే ఉండాలని DoPT స్పష్టం చేసింది.

అంతేకాదు, కొంతమంది అధికారులకు రిలీఫ్ ఆర్డర్లు జారీ చేస్తూ, అక్టోబర్ 16లోగా వారి అసలు క్యాడర్లకు తిరిగి వెళ్లాలని ఆ సంస్థ కోరింది. రిలీఫ్ ఆర్డర్స్‌ అంటే ప్రభుత్వ అధికారులు తమ ప్రస్తుత విధులను వదిలిపెట్టి, తమకు కేటాయించిన పోస్టులకు తిరిగి వెళ్లేందుకు అనుమతించే అధికారిక సూచనలు. ఇకపోతే కాట ఆమ్రపాలి, రోనాల్డ్ రోజ్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతి వంటి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన కొందరు అధికారులు ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి రావాలి. అదేవిధంగా తెలంగాణ కేడర్‌కు చెందిన ఎస్‌ఎస్‌ రావత్‌, అనంత్‌రాము, సృజన, శివశంకర్‌ లోతేటి వంటి ఆంధ్రప్రదేశ్‌లో సేవలందిస్తున్న అధికారులను కూడా తెలంగాణకు తిరిగి వెళ్లాలని సూచించారు.

అంజనీ కుమార్, అభిషేక్ మహంతి, అభిలాష్ బిస్త్ వంటి ప్రముఖ ఆఫీసర్లు తెలంగాణలో తమ పదవులను వదిలి ఆంధ్ర ప్రదేశ్‌లో తమ విధులకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేసు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను తిరిగి ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించారు, అయితే దీన్ని కోర్టులో సవాలు చేశారు. ఈ కేసు ఓడిపోయిన తర్వాత, అతను పదవీ విరమణ ఎంచుకున్నారు. ఆంధ్రాకి రావడానికి ఈ అధికారులకు ఎందుకు అంత భయం అనేది ప్రస్తుత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వాకాటి కరుణ (ఐఏఎస్, 2004), రోనాల్డ్ రాస్ (ఐఏఎస్, 2006), ఆమ్రపాలి (ఐఏఎస్, 2010), ప్రశాంతి (ఐఏఎస్, 2009), అంజన్ కుమార్ (ఐపీఎస్, 1990), అభిలాష్ బిస్త్ (ఐపీఎస్ 1994), అభిషేక్ మహంతి (ఐపీఎస్, 2011), వాణీ ప్రసాద్ (ఐపీఎస్, 1995) వంటి అధికారులు ఇప్పుడు రాష్ట్రాలను మార్చేయాల్సి వస్తోంది. వారిలో చాలా మందికి, ముఖ్యంగా హైదరాబాద్‌లో కుటుంబాలు ఉన్నవారికి, ఈ చర్య సవాలుగా ఉంది. హైదరాబాద్ ఫ్యామిలీ లైఫ్ కి చాలా బాగా సెట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో వారి డైలీ రొటీన్‌కు విఘాతం కలిగిస్తుందని అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. కానీ వారు తమకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్‌ ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఇచ్చిన క్యాడర్లలో పనిచేయాల్సిన బాధ్యత వారికి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ias