అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత.. తీన్మార్ మల్లన్న వాయిస్ మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. తన యూట్యూబ్లో.. 2028 అసెంబ్లీ ఎన్నికల సమయానికి.. రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోడని... కాకూడదని కూడా.. తీన్మార్ మల్లన్న రచ్చ రచ్చ చేశాడు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రి కానివ్వబోనని కూడా...తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
ఆ దిశగా తీన్మార్ మల్లన్న ఒక ఉద్యమం చేస్తున్నారు. బీసీ సామాజిక ఉద్యమం పేరుతో... వారంలో ఒక్క మీటింగ్ అయినా పెడుతున్నారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70 శాతం బీసీలు ఉన్నారని... వాళ్లలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని తీన్మార్ మల్లన్న నినాదం. కానీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి..వారు మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటున్నారని.. ఇకపై వారు ముఖ్యమంత్రి కాకూడదని తీన్మార్ మల్లన్న గొడవ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలోనే ఉండి... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా... తీన్మార్ మల్లన్నకు షాక్ ఇస్తూ... తెలంగాణ బీసీ నేతలతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు, వాళ్ల డిమాండ్ల సాధన కోసం.. ప్రత్యేకంగా కమిటీ వేస్తామని... రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారట. దీంతో బీసీ నేతలు అందరూ రేవంత్ రెడ్డి కి జై కొట్టారు. అయితే తీన్మార్ మల్లన్నను దెబ్బకొట్టేందుకే రేవంత్ రెడ్డి ఇలా స్కెచ్ వేశారని చెబుతున్నారు.