ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వాళ్ల మీద కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కి రెడ్ బుక్ లో తమ పేరు ఉందో లేదో అనే కంగారు ఉందని తెలిపారు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.


ఇకపై వైసీపీ నేతలకు సినిమా చూపిస్తానని కూడా హెచ్చరించారు.  యాక్షన్ అయితే అనివార్యమని వార్నింగ్‌ ఇచ్చారు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. వైసీపీ వాళ్లు ఏ పుస్తకం పెట్టుకున్నారో వాళ్లకే స్పష్టత లేదు కానీ నా నుంచీ ఇన్స్పైర్ అయ్యారని అర్ధమైందని తెలిపారు.  రాయలసీమ తయారీ రంగానికి, ఉత్తరాంధ్ర సేవా రంగానికి కేంద్రాలుగా మారనున్నాయని వివరించారు. పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు  జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.  


కూటమి ప్రభుత్వం పై నమ్మకంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారన్నారు.  బ్లూ బ్యాచ్ ఆగడాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఇబ్బంది అనిపిస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.  వరదలొస్తే జగన్ లా పరదాలు కట్టుకుని చంద్రబాబు అండ్ టీమ్ ఇంట్లో కూర్చోలేదని తెలిపారు. జగన్ కి ఆత్మల తో మాట్లాడే అలవాటు ఇంకా పోనట్లుందని తెలియ జేశారు.


గతంలో ఇలానే ఆత్మలతో మాట్లాడి కియా తమ ఘనతే అంటున్నారన్నారు.  ఇప్పుడు టీసీఎస్ గురించి  ఏ ఆత్మతో మాట్లాడారు? జగన్ హయాంలో తరిమేసిన పరిశ్రమలన్నీ మళ్లీ తెస్తున్నామని తెలిపారు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.  లూలూ, అశోక్ లైల్యాండ్ లే ఇందుకు ఉదాహరణ అంటూ గుర్తు చేశారు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: