ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అయితే అందుకు  తగ్గ కండిషన్లను కూడా అంతే రీతిలో పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.800 రూపాయలు ఉండగా మూడు సిలిండర్ల కింద లెక్క వేసుకుంటే రూ .2400 రూపాయలు అవుతుంది.. ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రాలో కోటి 30 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు ఇది ఇవ్వడం జరుగుతుందా అంటే అది సాధ్యం కాదంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ని కూటమి ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


అందుకు తగ్గట్టుగా అర్హతలు ఉండాలి అంటే కొన్ని కండిషన్లను పెడుతోంది.. అదేమిటంటే కచ్చితంగా తెల్ల రేషన్ కార్డుదారులు ఉండాలి వారు ఆంధ్రాలో నివాసం ఉండాలి అల్పాదాయ వర్గాలకు చెందిన వారు అయి ఉండాలట.. అలాగే కేవలం ఒక ఇంట్లో ఒక్కటే గ్యాస్ కనెక్షన్ ఉండాలట.అది కూడా వంట గ్యాస్ కనెక్షన్ అయ్యి ఉండాలి కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు వీరికి అనర్హులని తెలుపుతున్నారు. ఇలాంటివారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ తెలిపారు.


అలాగే మొబైల్ నెంబర్ తో పాటు విద్యుత్ బిల్లును కూడా జత చేయాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డు నెంబర్ తో పాటుగా ఫ్రూప్ కింద అడ్రస్ ని కూడా ఇవ్వాలట. ముఖ్యంగా ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వడం వల్ల వారి యొక్క ఆదాయాలను కూడా తెలుస్తుందని విద్యుత్ బిల్లు కూడా చూస్తారని వీటి వాడకం వల్ల ఎక్కువగా జాబితాలను తీశా అవకాశం ఉన్నది. ఉచిత పథకాలు అయినా మరే పథకాలు అయినా సరే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారే మాత్రమే అర్హతను కలిగి ఉంటారు. అయితే కోటి 30 లక్షల మంది తెల్లకార్డులలో మరొక 50,000 మంది అనార్హత జాబితా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే కేవలం 80 వేల మంది మాత్రమే అర్హతలు మిగిలి అవకాశం ఉన్నదట. ఈ 80 వేల మందికి మిగిలిన పథకాలన్నీ కూడా అర్హులని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: