ఏకంగా జీవితం లో ఎన్నో త్యాగాలు చేసి సమాజ హితం కోసం రతన్ టాటా పాటు పడిన తీరును కొనియాడారు. అంతే కాదు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేవలం పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాదు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులందరూ కూడా రతన్ టాటా మృతి తీరని లోటు అని.. ఆయన లాంటి గొప్ప మహోన్నతమైన ఆశయాలు కలిగిన మరో వ్యక్తిని చూడటం కష్టమే అంటూ సోషల్ మీడియా లో సంతాపం తెలియ జేశారు.
అయితే పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతి పై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కూడా స్పందిస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. అయితే ఆయన పెట్టిన పోస్ట్ మాత్రం ఎవ్వరికి నచ్చడం లేదు. అసలు మ్యానస్ ఉందా ఇదేనా ఒక లెజెండ్ కి సంతాపం తెలియ జేసే పద్ధతి అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారట. ఇంతకీ ఆయన పెట్టిన పోస్టు లో ఏముందంటే.. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్ ను కోల్పోయాం అంటూ పేర్కొన్నారు. చివర్లో టాటా బాయ్ బాయ్ అంటూ విజయ శేఖర్ రాసుకొచ్చారు. అయితే దిగ్గజానికి వీడ్కోలు పలికే పద్ధతి ఇదేనా అంటూ అందరూ మండిపడుతున్నారు.