రతన్ టాటా.. ఈయనను ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణిస్తూ ఉంటారు అందరూ. అయితే అందరిలాగానే ఈయన కూడా ఒక గొప్ప వ్యాపారవేత. ఇక అందరి లాగానే కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ అందరిలాగా సంపాదించిన మొత్తాన్ని దాచి పెట్టుకోవడం కాదు సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించాడు. ఇక తన బిజినెస్ చేయడంలోనూ ఎథిక్స్ ని ఫాలో అవుతూ.. ఇక ఎంతోమంది హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఆయన డబ్బులు సంపాదించే సమయంలో ఎన్నో త్యాగాలు చేశారు.

 అందుకే వ్యాపార రంగంలో రాణించాలి అనుకునే ఎంతో మందికి ఆయన కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ఆయనచెప్పిన ఆర్థిక సూత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం..

 నైతికత : డబ్బులు సంపాదించడం వ్యాపారవేత్తలు ఎవరైనా చేస్తారు. కానీ ఆ డబ్బును నైతికతతో న్యాయంగా సంపాదిస్తే.. ఇక ఉన్నన్ని రోజులు ఆర్థికంగా విజయం సాధిస్తూనే ఉంటాం అని రతన్ టాటా చెప్పారు  చెడు మార్గంలో తొందరగా డబ్బును కూడా కూడగట్టుకోవాలనుకుంటే పతనం తప్పదు అంటూ ఆయన సూచించారు.


 ఇవ్వడం నేర్చుకోవాలి : మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడే తిరిగి అలాంటివే మన దగ్గరికి వస్తాయని రతన్ టాటా బలంగా నమ్ముతారట. మంచి పనులు డబ్బు ఈ రెండింటికి ఈ సూత్రం వర్తిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అంటే మీరు డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు చేయడం నేర్చుకోవాలట.


 అవకాశాలను అందిపుచ్చుకోవడం  : అన్ని సజావుగానే ఉన్నాయి కదా అనే ధోరణి నుంచి బయటపడి ఇక డబ్బు వృత్తి విషయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రతన్ టాటా సూచించారు. మిగతా వారి కంటే భిన్నంగా ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.


 నిర్ణయాలను గౌరవించడం  : ముందుగా ప్రతి ఒక్కరు వారు వారు తీసుకునే నిర్ణయాలపై ఎక్కువ విశ్వాసం పెట్టాలట. అవి మంచివా చెడువా అనేది తర్వాత విషయం.. ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి ఆలోచించాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద నిలబడాలి అంటూ రతన్  టాటా సూచించారు.


 తెలివిగా పెట్టుబడులు  : ఒకచోట పెట్టుబడులు పెట్టడం వల్ల డబ్బులు సంపాదించే అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే మిగతా వారితో పోల్చి చూస్తే వైవిధ్యానికి పెద్ద పీట వేయాలని ఆయన సూచించారు. అంటే ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: