సాయాజి షిండే మాట్లాడుతూ తాను చాలా కాలంగా ఎన్నో సేవలు చేస్తున్నానని తన సేవలను కొనసాగించాలనుకున్నాను అందుకే అజిత్ పవర్ ని ప్రశంసిస్తూ ఆయన పార్టీ విధానాలను తనని చాలా ఆకట్టుకున్నాయని అందుకే ఎన్సీపీ పార్టీలో చేరాలనుకుని నిర్ణయించుకున్నాను అంటూ తెలిపారు. సినిమాలో ఎన్నో రాజకీయ పాత్రలలో నటించాను కానీ రాజకీయ నాయకుడిగా మారలేదు అందుకే తాను చేసిన సేవ కార్యక్రమాలు బయటకు చెప్పుకోకూడదని వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేస్తేనే బాగుంటుందనుకున్నానని అందుకే తాను ఎంపీపీ విధానాలను ఇష్టపడే ఈ పార్టీలోకి చేరానని తెలిపారు.
తనకి రాజకీయాలలో మాత్రం ఎలాంటి స్వార్థం లేదని తెలియజేశారు.. ఆ తర్వాత ఎన్సీపీ నేత జగన్ భుజబల్ ఇలా మాట్లాడుతూ..సాయాజి షిండే గురించి ఇలా మాట్లాడుతూ షిండే చాలా అద్భుతమైన నటుడు అద్భుతమైన వ్యక్తి రాజకీయ నాయకుడుగా ఎదగాలని కోరుకుంటున్నాను అంటు తెలియజేశారు. షిండే రాజకీయాలలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని షిండే మాతృభాష మరాఠీ అయినప్పటికీ కూడా తాను ఎన్నో భాషలలో నటించి మంచి పేరు సంపాదించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలవడం జరిగింది. పలు విషయాలను కూడా మాట్లాడారు. అయితే సాయాజి షిండే మరి రాజకీయాలలో సక్సెస్ అయి ఏ విధంగా గెలుస్తారో చూడాలి మరి.