ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ ల కోసం ఏ స్థాయిలో పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాన్ రిఫండబుల్ డిపాజిట్ అయినప్పటికీ రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. దాదాపుగా 90 వేల దరఖాస్తులు రాగా ఈ దరఖాస్తుల ద్వారా 1792 కోట్ల రూపాయల మేర ఏపీ సర్కార్ కు ఆదాయం సమకూరిందని తెలుస్తోంది. కొంతమంది వ్యాపారులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
 
ఏపీలోని 3396 దుకాణాలకు దరఖాస్తులు రావడం గమనార్హం. నిన్న ఒక్కరోజే ఏకంగా 24014 దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఒక్కో దుకాణానిక్ యావరేజ్ గా 26 దుకాణాలు వచ్చాయని సమాచారం అందుతోంది. విజయనగరం, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో పోటీ ఎక్కువగా ఉండగా కొన్ని దుకాణాలకు 100కు పైగా దరఖాస్తులు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మద్యం దుకాణాలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. అయితే రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మాత్రం తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు దరఖాస్తు వేయకుండా అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో మూడు దుకాణాలకు కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది.
 
వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని పెండ్లిమర్రిలో ఉన్న దుకాణానికి సైతం ఒకే ఒక దరఖాస్తు వచ్చింది. 2017లో మద్యం దుకాణాల ద్వారా ఏపీకి 474 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఇప్పుడు ఆ పరిస్థితి మారిందనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సిండికేట్ వల్ల పరిస్థితులు మారిపోయాయని తెలుస్తోంది. మద్యం టెండర్లలో అధికార పార్టీ నేతలదే హవా అని ప్రచారం జరుగుతోంది. అయితే మద్యం దుకాణాలు దక్కడం మాత్రం పూర్తి స్థాయిలో లక్ పై మాత్రమే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: