ఇంత అప్పు ఏపీ దరిదాపుల్లో కూడా మరొక రాష్ట్రం రాలేదని కూడా తెలియజేశారు జాతీయ సగటు లక్ష మందిలో 18,322 ఉండగా దీనికంటే మూడు రెట్లు ఆంధ్రాలోనే ఉన్నదట. అయితే ఈ సర్వేను 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్యలో నిర్వహించడం జరిగిందట. ఈమెరకు 500 కంటే ఎక్కువ రుణం తీసుకొని వాటిని చెల్లించని వారందరినీ కూడా రుణ గ్రహీతలుగా పరిగణంలోకి తీసుకున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా ఏపీలో అప్పులు చేసిన వారిలో పట్టణాలలో కంటే గ్రామాలలోనే 4.30% ఎక్కువమంది ఉన్నారని తెలియజేశారు.
అలాగే పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామలలోనే ఉండే మహిళలే 32.86% ఉన్నారట.. ఇక పురుషుల విషయానికి వస్తే పట్టణాలలో కంటే పల్లెలలో 1.56% మంది ఉన్నారట. ఇక పట్టణ మహిళలతో పోలిస్తే పురుషులు 21.69% ఎక్కువ మంది ఉండగా.. గ్రామీణ ప్రాంతాలలో పురుషుల కంటే మహిళలే 7.49% ఉన్నారట. దేశం అప్పులలో చూస్తే పురుషుల కంటే మహిళలు అప్పుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం మరేదీ లేదని కూడా తెలుపుతున్నారు.. సగటు ప్రతి లక్ష మందిలో ఎక్కువమందికి అప్పులు ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం.. రెండవ స్థానం తెలంగాణ, మూడవ స్థానం తమిళనాడు, నాలుగవ స్థానం కర్ణాటక, ఐదవ స్థానం కేరళ.