సాధారణంగా ఎన్నికలు జరిగిన తర్వాత  ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీనే ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మూడేళ్ల పాటు మాత్రమే అధికారంలో ఉంటుందనే చర్చ ఇప్పుడూ ఎక్కువగా కొనసాగుతోంది. అందుకు కారణం ఇప్పుడు జమిలి ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతాయని విషయమే ఎక్కువగా ప్రచారంలో ఉన్నది. జమిలి ఎన్నికలు అంటే లోక్సభ తో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరగడమే.


అయితే ఇది రెండు దశలుగా జరుగుతుందని.. మొదటి దశలో 28 రాష్ట్రాలలో సగం రాష్ట్రాలలో లోక్సభతో నిర్వహిస్తారని మరొక దశ మిగిలినవి కూడా కలుపుకొని జరుపుతారని తెలుపుతున్నారు. ఇలా చూస్తే 2026 చాలా కీలకమని సమాచారం. ఆ ఏడాది అరడజను పైగా రాష్ట్రాలలో ఎన్నికలు ఉండబోతున్నాయట.. 2027 లో గతంలో జరిగిన ఎన్నికలు రాష్ట్రాలతో కలుపుకుంటే మొదటి దశలో 15కుపైగా రాష్ట్రాలతో పాటు కేంద్ర ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేస్తూ ఉండట కేంద్ర ప్రభుత్వం. 2028లో జరగాల్సిన తెలంగాణ ఎన్నికలు 2027 లో జరగాల్సిన కర్ణాటక కేరళ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా 2027 లోనే జరగబోతాయట.


దీన్ని బట్టి చూస్తే ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి కేవలం మూడేళ్లు మాత్రమే అవుతుందని సమాచారం. అయితే ఇలా ఏపీలో ఎన్నికలు ఎదుర్కోవడం ఎవరికి లాభం నష్టం అనే చర్చ ఇప్పుడు కొనసాగుతోంది. ఓడిపోయిన ప్రజలలో ఆదరణ ఉందని ఈవీఎంల వల్లే కూటమి గెలిచిందనే విధంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం చేపట్టలేదు కనుక.. ఇది కూడా మైనస్ గా మారెలా ఉంది ఒకవేళ చేస్తే ప్లస్ అవుతుంది. కేంద్రంలో మాత్రం బిజెపి సిద్ధంగానే ఎన్నికలకు ఉండి అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తోంది. బిజెపి పార్టీతో పొత్తులు ఉంటే ఒకలాగా లేకపోతే మరొక లాగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఉండవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: