ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ వార్తలను నమ్మాలో ఏ వార్తలను నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో బీజేపీలో జనసేన విలీనం అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వార్తలు గాసిప్స్ అని ఏ మాత్రం నమ్మశక్యంగా లేవని చెబుతున్నారు. జనసేన విలీనం కావాలి అనుకుంటే ఎప్పుడో విలీనం అయ్యేదని కామెంట్లు చేస్తున్నారు.
 
2024 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో జనసేన గెలిచిందని అదే సమయంలో బీజేపీతో పోల్చి చూస్తే జనసేనకే ఎక్కువగా ప్రాధాన్యత ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2029 ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారం కూడా నమ్మేలా లేదు. 2029 ఎన్నికల సమయానికి పొలిటికల్ గా కొన్ని సమీకరణలు మాత్రం మారే ఛాన్స్ అయితే ఉంది.
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో పొలిటికల్ కెరీర్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని అందువల్ల పవన్ పొలిటికల్ కెరీర్ విషయంలో తప్పులు చేసే అవకాశాలు అయితే ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు2 విషయంలో సైతం పవన్ ఫ్యాన్స్ కు నమ్మకాలు లేవు.
 
హరిహర వీరమల్లు1 ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తే మాత్రమే హరిహర వీరమల్లు2 సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. హరిహర వీరమల్లు సినిమా వల్ల నిర్మాతపై వడ్డీ భారం ఊహించని స్థాయిలో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ షూటింగ్స్ లో ఎప్పటినుంచో పాల్గొననున్నారో కూడా పూర్తిస్థాయిలో స్పష్టత లేదనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని సక్సెస్ రేట్ భారీగా పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: