ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నిన్నటి రోజు  మాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖి దారుణ హత్య దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలు సృష్టిస్తోంది.. హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో సంబంధాలు ఉన్న సిద్ధిఖీని విజయదశమి రోజున గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే అలా చంపిన వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాద్ శషిండే వెల్లడించడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని ముంబై పోలీసులు చెప్పారని తెలిపారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి.



అలా కాల్చి చంపిన దుండగులలో ఒకరు యూపీకి చెందినవారు అని మరొకరు హర్యాన ప్రాంతానికి చెందిన వారని మూడవ వ్యక్తి పరారీలో ఉన్నారన్నట్లుగా తెలిపారట పోలీసులు. దీంతో ఈ విషయం తెలిసిన నేతలు కూడా హుటాహుటిగా వెళ్లి ఆసుపత్రికి బాబా సిద్ధిఖి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ విషయం తెలిసిన అటు అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి  గురవుతున్నారు. పండుగ రోజు సందర్భంగా తన కుమారుడు జిషాన్ కార్యాలయం దగ్గర బాణసంచా పేలుచుతున్న సమయంలో సిద్ధికి పైన దాడి జరిగినట్లు పలు రకాల మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.


రాత్రి 9:15 నుంచి 9:20 నిమిషాల మధ్యలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. సిద్ధిఖి బాణసంచా పేల్చుతున్న సమయంలోనే ముగ్గురు దుండగులు ముఖానికి మాస్క్ ధరించుకొని మరి వచ్చి ఆయన పైన కాల్పులు జరిపారని.. తన శరీరం మీద ఆరు బుల్లెట్లు దూసుకు వచ్చాయి. ఇది చూసిన అక్కడి అభిమానులు వెంటనే సిద్ధికి అని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స అందుతున్న సమయంలోనే మృతి చెందినట్లుగా సమాచారం. అయితే బాబా సిద్ధిఖిని ఆ దుండగులు ఎందుకు చంపారు వారి వెనుక ఉన్నది ఎవరు అనే విషయం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. అయితే ఈ నేత బాలీవుడ్ సల్మాన్ ఖాన్ కు మంచి క్లోజ్ ఫ్రెండ్ అని.. విభేదాల సమయంలో షారుక్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ మధ్య సంధి చేసేవారని  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: