కూటమిలో భాగంగా అటు ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందుతుందనే విధంగా భావిస్తూ ఉన్నారు. అలా ఇప్పటికే ఎంతోకొంత అందిస్తూనే ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు తాజాగా దసరాకి బాబు సర్కార్ కి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక కొత్త బోనస్ ఇచ్చింది మోదీ సర్కార్.. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు కేంద్ర నిధులను విడుదల చేశారు. 17వ ఆర్థిక సంఘం కింద మొదటి విడతగా రూ .593 కోట్ల రూపాయలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఉండేటువంటి పంచాయతీలు, మండలంలోని పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు ఈ నిధులను సైతం  కేటాయించాలని తెలియజేసిందట.


ఇటీవల కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు రూ .100 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది.. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద తూర్పుగోదావరి జిల్లాలో పుష్కర పనుల కోసమని ఈ డబ్బులను విడుదల చేసింది. 2027 లో వచ్చే ఏడాది పుష్కరాలకు సంబంధించి. మరొకవైపున ఈ మధ్యనే చూస్తే.. రాష్ట్రానికి సంబంధించి రూ .7211 కోట్ల రూపాయలు పన్నుల వాటా కిందన ఇచ్చుకున్నారు. ఓవరాల్ గా చంద్రబాబు కు ఫైనాన్షియల్ క్రెన్స్ లేకుండా ఎప్పటికప్పుడు మోడీ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఏదో ఒక రూపంలో నిధులను ఇస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం.


మరి ఇప్పుడైనా ఏపీ సీఎం చంద్రబాబు పాత బిల్లులన్నిటిని క్లియర్ చేస్తే బాగుంటుందని ప్రజలతోపాటు పలువురు నేతలు అనుకుంటున్నారు.. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ బిల్లు లాంటివి ఈజీగా తీర్చేయవచ్చు. అలాగే కాంట్రాక్ట్ పనుల బిల్లులు కూడా తొందరగా తీర్చేయవచ్చు. ఆదిశగా అడుగులు వేస్తే .. ఆయా వర్గాలలో కాన్ఫిడెంట్ వస్తుందని కూడా చెప్పవచ్చు. మరి ఏ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు అడుగులు వేస్తారో చూడాలి. ఇవే కాకుండా కూటమి ప్రభుత్వం తరఫునుంచి చాలానే హామీలను ఇచ్చారు.. వాటన్నిటిని కూడా అమలు చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: