ముఖ్యంగా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ పైన ప్రతి కారం తీర్చుకునే విధంగా కొండ సురేఖ దంపతులు వ్యవహరిస్తున్నారు. కొండా సురేఖకు మంత్రి పదవి వచ్చిన తర్వాత రేవూరి ప్రకాష్ ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. అయితే తాజాగా... ఇదే అంశంలో పోలీస్ స్టేషన్కు వెళ్లి రచ్చ రచ్చ చేశారు తెలంగాణ మహిళా మంత్రి... కొండా సురేఖ. సీఐ సీట్లో కూర్చొని మరీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లు... ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
వాసవంగా తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి కార్యకర్తల మధ్య చిన్న వివాదం చోటు.. చేస్తుందని సమాచారం. ఇందులో ఫ్లెక్సీ వివాదమే... ఇక్కడి వరకు తీసుకువచ్చిందట. ఈ తరుణంలో కొంతమంది మంత్రి కొండా సురేఖ అనుచరులపై కేసులు పెట్టారట. దీంతో కోపంతో ఊగిపోయిన కొండా సురేఖ వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చారు.
వరంగల్లోని గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చిన కొండా సురేఖ రచ్చ చేశారు. ఆ గీసుకొండ సీఐ కుర్చీలో కూర్చుని మరీ రెచ్చిపోయారట కొండ సురేఖ.తన అనుచరులపై ఎలా కేసులు పెడతారని... చాలా ఇబ్బంది పెట్టారట. కొంతమంది అరెస్టు చేసిన కార్యకర్తలను కూడా విడిపించుకున్నారట కొండా సురేఖ. అయితే ఇప్పుడు.. Ci కుర్చీలో కొండా సురేఖ కూర్చోవడం వివాదంగా మారింది. దీనిపై గులాబీ పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. వెంటనే కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని... ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.