రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఓ ఈవెంట్ ఆర్గనైజర్, తెలుగు యాంకర్ కావ్య శ్రీ పైన... దాడికి పాల్పడ్డాడు మాజీ ఎంపీ భరత్ అనుచరుడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి చెల్లించాలని... అడిగినందుకుగాను... యాంకర్ కావ్య శ్రీ తండ్రి నాగరాజును... బండ బూతులు తిట్టడమే కాకుండా దారుణంగా కొట్టాడు భరత్ అనుచరుడు. దీన్ని అడ్డుకున్న వారి పైన కూడా భరత్ అనుచరుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను తీసేందుకు యాంకర్ కావ్య శ్రీ... ప్రయత్నం చేసింది. ఈ ధర్నాలో యాంకర్ కావ్య శ్రీ ఫోన్ లాగేసుకొని దాడి చేసే ప్రయత్నం చేశాడు మాజీ ఎంపీ భరత్ అనుచరుడు. వాస్తవంగా 2021 సంవత్సరంలో.... యాంకర్ కావ్య శ్రీ కుటుంబం నుంచి వైసీపీ మాజీ ఎంపీ భరత్ అనుచరులు... నల్లారి వెంకట శ్రీనివాస్ అలాగే ఆయన కుమారుడు అభిషేక్... అవసరం కోసం మూడు లక్షలు అప్పుగా తీసుకోవడం జరిగింది.
డబ్బులు తీసుకునేటప్పుడు... మెల్లగా మాట్లాడిన భరత్ అనుచరుడు.... తిరిగి చెల్లించమన్నందుకు దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో అలాగే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కావ్య శ్రీ ఇంటికి వచ్చి దాడి చేయడంపై.. వైసిపి పట్ల తీవ్ర వ్యతిరేకత... వ్యక్తమవుతోంది. అయితే ఈ సంఘటనపై ఇంకా మాజీ ఎంపీ భారత్ స్పందించలేదు. ఆయన స్పందించి తన అనుచరుడు పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.