రాయలసీమలో తాడిపత్రి నియోజవర్గంలో జేసీ కుటుంబం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారం ఉందంటే చాలు అక్కడ తమదే హవా ఉంటుందని చెప్పవచ్చు.జెసి ప్రభాకర్ రెడ్డి  తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. అప్పటినుంచి తాడిపత్రిని అభివృద్ధి చేసే పనులలో మరొకసారి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్న ప్రభాకర్ రెడ్డి  తాజాగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేకాట క్లబ్బులు ఇసుక వ్యాపారం చేసేటువంటి ఎవరైనా సరే వారి సంపాదనలో 15% కమిషన్ ఇవ్వాలంటూ డైరెక్ట్ గానే హెచ్చరిస్తున్నారు.


అయితే ఇదంతా కేవలం నియోజవర్గంలో అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తామని తెలిపారు. దశాబ్దాల నుంచి తాము రాజకీయాలలో ఉన్నామని ప్రజలు తమకు అండగానే ఉన్నారని నియోజవర్గ అభివృద్ధి తప్ప తమకు ఏమీ తెలియదని తెలుపుతున్నారు. అలాగే మద్యం షాపులు నిర్వహించే వారికి కూడా తమకు కచ్చితంగా 35% కమిషన్ ఇవ్వాలి అంటూ చెప్పడంతో చాలామంది ప్రజలు నేతలు వ్యాపారస్తులు కూడా వీరిని విమర్శిస్తూ ఉన్నారు. అలాగే మరొకవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తాడిపత్రిలోకి రానివ్వలేదు. అలాగే ప్రత్యర్థులు ఎవరు కూడా తాడిపత్రిలో అడుగు పెట్టడానికి వీలు లేదనే విధంగా కొత్త రూల్స్ ను తీసుకు వస్తున్నారట.


అభివృద్ధి పేరుతో కమిషన్ ఇవ్వాలని డైరెక్ట్ గానే అడగడంతో ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గం లో ఈ విషయం చాలా సంచలనంగా మారింది. ఈ విషయాన్ని అక్కడ స్థానికులతో పాటు వైసిపి శ్రేణులు కూడా విమర్శిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలలో తాడిపత్రి కాస్త భిన్నంగానే ఉంటుందని చెప్పవచ్చు. గత కొద్దిరోజులుగా టిడిపి నేతలే ఇసుకని దోచుకుంటున్నారంటే సంచలన వీడియోలు కూడా విడుదల చేశారు ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి  కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇసుక దందా చేస్తున్నారని కోర్టుల చుట్టూ తిరిగినప్పటికీ కానీ ఇప్పుడు కూడా తమను చర్యలు ఇలా చేస్తూ ఉండడంతో విమర్శిస్తూ ఉన్నారు. ఇక అక్కడ అధికారులతో పాటు నేతలు కూడా చాలా పెదవి విరుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: