తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. గేమ్ ఛేంజర్ పాటతో రేవంత్ రెడ్డి వీడియోను షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు అయిన కొండారెడ్డి పల్లి గ్రామానికి వెళ్లారు. రేవంత్ రెడ్డి రావడంతో గ్రామస్థుల సంతోషానికి, ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
 
సొంతూళ్లో రేవంత్ రెడ్డి పర్యటించిన వీడియోకు గేమ్ ఛేంజర్ సినిమాలోని రా మచ్చా మచ్చా సాంగ్ ను యాడ్ చేయగా ఈ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. రేవంత్ రెడ్డి తన పోస్ట్ లో గంటలు క్షణాల్లా గడిచిపోయాయని అనుబంధాలు శాశ్వతమై మిగిలాయని చెప్పుకొచ్చారు. కొండారెడ్డిపల్లిలో ఈ దసరా నా జీవన ప్రస్థానంలో ఆత్మీయ అధ్యాయం అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
 
రేవంత్ రెడ్డి షేర్ చేసిన వీడియోను ఎస్వీసీ బ్యానర్ రీట్వీట్ చేయడం గమనార్హం. రేవంత్ రెడ్డి షేర్ చేసిన వీడియోకు 10000కు పైగా లైక్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి సొంతూరుకి వస్తే ఆయన సీఎం అయినా సొంతూరుకు వస్తే మీ వాడినే అనే అర్థం వచ్చేలా ఉండటం గమనార్హం. వీడియోలో రేవంత్ రెడ్డి ఊరు మొత్తాన్ని చూపించడం కొసమెరుపు. రేవంత్ రెడ్డి సొంతూరికి ఇచ్చే ప్రాధాన్యతను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
 
మరోవైపు రామ్ చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ వ్యూస్ పరంగా అదరగొడుతుండటంతో సంతోషిస్తున్నారు. రా మచ్చా మచ్చా సాంగ్ కు యూట్యూబ్ లో ఇప్పటివరకు 34 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అనంత్ శ్రీరామ్ ఈ సాంగ్ కు లిరిక్ రైటర్ గా వ్యవహరించారు. థమన్ తన మ్యూజిక్ తో ఈ సాంగ్ స్థాయిని పెంచే విషయంలో సక్సెస్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: