ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మరొకసారి చర్చ మొదలయ్యింది. ఎన్నికల సర్వే సంస్థ ఆరా చీఫ్ ఆరా మస్తాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈవీఎంల ట్యాంపరింగ్ చేయడం కుదురుతుందని, అందుకే ఊహించిన ఫలితాలు రాకుండా వేరే ఫలితాలు వస్తున్నాయని అన్నారు. తను వైసీపీ గెలుస్తుందని సర్వే చేసేది తెలిపామని అది అబద్ధం అయ్యిందని దానికి కారణం ఈవీఎం టాంపరింగ్ అని అన్నారు. హర్యాన రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెంట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పూర్తి ఆధిక్యతతో దుమ్మురేపారు. కానీ ఎప్పుడైతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైందో వారందరూ కూడా వెనుకంజలో పడ్డారు.
దీన్ని బట్టి మనం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అర్థం చేసుకోవచ్చని ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా గెలుస్తామని నియోజకవర్గాల్లో కాకుండా వేరే నియోజకవర్గాల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేస్తూ అక్రమంగా గెలుస్తున్నారని ఆరా మస్తాన్ ఆరోపించారు. ఒకప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి చంద్రబాబు ఏ మాట్లాడాలని కానీ ఇప్పుడు మాత్రం ఆయన గప్‌చుప్ గా ఉన్నారని దీన్ని బట్టి ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆరా మస్తాన్ వీడియో క్లిప్పులను వైసీపీ బాగా సర్కులేట్ చేస్తోంది. వీటిని చూసినా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు చాలామంది విరుచుకుపడుతున్నారు. ఆరా మస్తాన్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఆయన దొరికితే కొట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
ఎలాన్ మస్క్, శామ్ పిట్రోడా ఈవీఎంలను ట్యాంపర్ చేయడం కుదురుతుందని ఆల్రెడీ చెప్పినట్లు ఆరా మస్తాన్ గుర్తు చేశారు. టీడీపీ నేత వేమూరి హరిప్రసాద్, ఇప్పటి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి ఎన్నికల కమిషన్ అధికారుల ముందే ఓ డెమాన్‌స్ట్రేషన్ కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమే అని ఆయన నొక్కి చెప్పారు. ఎలా నిరోధించాలనే విషయంపై ఈసీ దృష్టి పెట్టకపోవడం బాధాకరమని అన్నారు. ఇది ఎన్నికల కమిషన్‌పై ఓ మచ్చలా మారుతుందని వ్యాఖ్యానించారు.