కేకే సర్వే... ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిపోయింది. మొన్నటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసిపి పార్టీ అలాగే తెలుగుదేశం కూటమి సీట్లను ఎగ్జాక్ట్గా... ఎవరు చెప్పలేని విధంగా కేకే సర్వే చెప్పడం జరిగింది. అందరూ వైసీపీ పార్టీ గెలుస్తుందని అంచనా వేయగా... ఏపీలో వైసీపీ పార్టీకి 11 స్థానాలు వస్తాయని కేకే సర్వే స్పష్టం చేసింది. అటు తెలుగుదేశం కూటమికి 164 స్థానాలకు పైగా వస్తాయని కేకే సర్వే ముందే అంచనా వేసింది.


ఈ తరుణంలో... ఫలితాలు రాగానే కేకే సర్వే... అంచనాలు... వందకు 200 శాతం అయ్యాయి. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కేకే సర్వేకు మంచి  పేరు వచ్చింది. ఈ సంస్థను కిరణ్ అనే వ్యక్తి నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్న హర్యానా ఎన్నికల్లో కూడా... కేకే సర్వే.. పనిచేయడం జరిగింది. కానీ అక్కడ కేకే సర్వే చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. దీంతో ఆయన సర్వే సంస్థ పై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇది ఇలా ఉండగా... తాజాగా...  రేవంత్ రెడ్డి సర్కారు పనితీరుపైన కేకే సర్వే సీఈఓ కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో... ప్రాంతీయ పార్టీగా గులాబీ పార్టీ... ప్రతిపక్ష హోదాలో.. చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు.  మొన్నటి ఎన్నికల్లో తక్కువ మెజారిటీతోనే టిఆర్ఎస్ పార్టీ ఓడిందని గుర్తు చేశారు.


ఓడిపోయిన తర్వాత టిఆర్ఎస్... చాలా బలంగా తయారైందని కూడా వెల్లడించారు. ఆ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్తే... కెసిఆర్ కి ఏమీ నష్టం ఉండదన్నారు. 80 శాతం సీట్లు ఓటర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని చూసి మాత్రమే ఓటు వేస్తారని... ఎమ్మెల్యే క్యాండిడేట్లను చూసి ఓటు వేయరని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత.. కేవలం టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు... కనిపిస్తుందని.. వివరించారు. కాబట్టి భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీకి మంచి స్కోప్ ఉంటుందని కూడా ఆయన అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: