ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు కూటమి సర్కార్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కూటమి ప్రభుత్వ ఏర్పాటు అయి దాదాపు 100 రోజులు అయింది. అయితే 100 రోజుల్లో.. ఏ ప్రభుత్వం అయినా పనులు చేయడానికి కాస్త ఆలస్యమే పడుతుంది. మినిమం ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు అయిన రెండు సంవత్సరాల వరకు... ప్రతిపక్షాలు కాస్త ఓపిక పట్టాల్సి.. ఉంటుంది.


కానీ చంద్రబాబు వచ్చిన 100 రోజుల్లోనే... హామీలు నెరవేర్చలేదని వైసీపీ మొండి పట్టు పట్టింది.  ఇక దీనికి తోడు ఏబీఎన్ రాధాకృష్ణ కూడా... కూటమి ప్రభుత్వం పై వరుసగా కథనాలు రాస్తున్నారు.  వాస్తవంగా ఎల్లో మీడియాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని పిలుస్తూ ఉంటారు. కానీ అలాంటి ఏబీఎన్ ఛానల్, న్యూస్ పేపర్... గత రెండు నెలలుగా.. చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తోంది. 100 రోజుల పాలనలో టిడిపి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి..  వ్యవహరిస్తున్నారని చాలా వార్త కథనాలను రాసింది ఆంధ్రజ్యోతి.


అంతే కాకుండా ఓపెన్ విత్ ఆర్కే సోలో కూడా... చంద్రబాబు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు ఆర్కే. ఇసుక స్కాం, మద్యం టెండర్లలో టిడిపి ఎమ్మెల్యేల హడావిడి, ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీల విషయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరగటం, ముఖ్యంగా మహిళలపై దాడులు జరగడం, తిరుమల శ్రీవారి లడ్డు విషయం, అటు వరదల విరాళాల గురించి కూడా... ఏబీఎన్ ఆర్కే కథనాలు... ప్రసారం చేస్తున్నారు.

చంద్రబాబు మాట ఎమ్మెల్యేలు వినకుండా రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారని కూడా... చాలా కథనాలను అల్లారు ఆర్కే. ఇదే... తంతు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రమాదం తప్పదని ఆయన... పరోక్షంగా హెచ్చరించడం జరిగింది.  వైసిపి తప్పిదాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తే ఎలా అంటూ నిలదీస్తోంది ఏబీఎన్. అయితే ఇంత జరిగినా కూడా చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఈ కథనాలపై టిడిపి నేతలు ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: