ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాల హడావిడి కనిపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న... మద్యం పాలసీని రద్దుచేసి... కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఈ మేరకు మొన్నటి వరకు టెండర్లను... చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అయితే టెండర్ల గడువు ముగియడంతో... టెండర్ వేసిన వారికి... లక్కీ డ్రా ద్వారా.. దుకాణాలను అప్పగిస్తుంది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు.సోమవారం రోజున 26 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ లాటరీ ప్రక్రియ జరిగింది. అయితే ఇందులో మహిళలకు 345 దుకాణాలు దక్కాయి. అంటే దాదాపు పది శాతం వాళ్లకే వెళ్లాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి కూడా... కొన్ని దుకాణాలు దక్కాయి. ఈ తరుణంలోనే ఓ షాకింగ్ నిజం బయటికి వచ్చింది. ఏపీ మంత్రి నారాయణ కూడా ఈ టెండర్లు వేశారు.


నెల్లూరు జిల్లా  వ్యాప్తంగా దాదాపు 100 దరఖాస్తులు  చేశారట ఏపీ మంత్రి నారాయణ. ఒక్కో షాప్ పైన రెండు కోట్ల చొప్పున... 100 దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్నారట. అయితే చివరికి మంత్రి నారాయణ కు మూడు లిక్కర్ దుకాణాలు మాత్రమే లాటరీ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ దరఖాస్తులను నేరుగా మంత్రి నారాయణ వేయకుండా తన అనుచరుల ద్వారా వేయించారని సమాచారం.


ఇక ఈ ముడు మద్యం షాపులను 15 మందికి అప్పగించారట నారాయణ.  ఒక్కో మద్యం దుకాణం ఐదుగురు చొప్పున నడుపుకోవాలని సూచించారట. అయితే విద్యా సంస్థలు నడుపుతున్న మంత్రి నారాయణ మద్యం దుకాణాలు నడపడం కూడా... ఇప్పుడు వివాదంగా మారింది. పిల్లలకు చదువులు చెప్పే.. స్థాయిలో ఉన్న మంత్రి నారాయణ... మద్యం అమ్మేసి...  జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడని వైసిపి నేతలు మండిపడుతున్నారు. అయితే.. ఇందులో తప్పేం ఉందని కొంత మంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: