అయితే అంతకుముందు వైసీపీ అధికారంలో ఉండగా ప్రత్యర్థులపై కౌంటర్లతో విరుచుకుపడిన కొడాలి నాని.. గత కొంతకాలం నుంచి ఓటమి తర్వాత మాత్రం మీడియాకు దూరంగానే ఉంటున్నారు. దీంతో కొడాలి నాని ఎందుకు ఇలా మీడియాకు దూరంగా ఉంటున్నారు అనే విషయంపై అభిమానులు కూడా అయోమయంలో పడిపోయారు. మళ్లీ ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్ధులకు కౌంటర్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కాగా ఇటీవలే కొడాలి నాని తిరుమల లో ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడూ గుబురు గడ్డం తో కనిపిస్తూ మాస్ లీడర్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే కొడాలి నాని.. ఇక ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారి పోయారు. ఒక్క సారిగా గుండు గీయించుకుని గడ్డం మీసం లేకపోవడంతో ఆయనను ఎవరు గుర్తుపట్టలేక పోతున్నారు.
ఇటీవల సోమవారం రాత్రి తిరుమలకు వచ్చిన కొడాలి నాని మంగళవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇక మొక్కులు తీర్చుకున్న ఆయన తలనీనాలు సమర్పించారు. అయితే తెల్లని బట్టలు ధరించి ఎప్పుడు గుబురు గడ్డంతో కనిపించే ఆయన గుండు గీయించుకుని ఇలా గడ్డం లేకుండా కనిపించడంతో ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అయితే కొడాలి నాని కి సంబంధించిన కొత్త లుక్స్ కి సంబంధించిన ఫోటోలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.