ప్రస్తుత విశాఖ టీడీపీ ఎంపి భరత్‌పై కేవలం 3000 ఓట్ల స్వల్ప తేడాతో ఆయన ఎంపీగా విజయం సాధించారు. అయితే ఎన్నికలకు ముందు ఎంవీవీ పట్టుబట్టి తను విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో.. జగన్ విశాఖ తూర్పు సీటును ఆయనకే కేటాయించారు. వాస్తవానికి తూర్పు నియోజకవర్గంలో బీసీలలో.. బలమైన యాదవులు ఎక్కువగా ఉన్నారు. ఆ సీటును యాదవులకు ఇవ్వాల్సి ఉన్నా.. సత్యనారాయణ పట్టు పట్టడం.. అటు తెలుగుదేశం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు పోటీలో ఉండడంతో.. అదే సామాజిక వర్గం నుంచి సత్యనారాయణ పోటీ చేశారు.
ఎన్నికలలో ఓడిపోయిన సత్యనారాయణ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అసలు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం.. కొంతమంది నేతలను టార్గెట్ చేసింది. మాజీ ఎంపీ విషయంలోనూ విశాఖకు చెందిన కూటమి నేతలు పట్టుదలగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీతో అంటకాగటం కంటే.. దూరం దూరంగా ఉండటమే బెటర్ అని సత్యనారాయణ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా సత్యనారాయణ జగన్‌కు ఇప్పటికే చెప్పినట్టు టాక్.