ఇక ఎన్నికల సమయంలో కూడా దగ్గుబాటిని ఓడించడానికి ప్రయత్నాలు చేశారనే విధంగా కూడా వార్తలు వినిపిస్తూ ఉండేవి. ముఖ్యంగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా వీరిద్దరి మధ్య అటు రాజకీయాలలో, ఇటు వ్యాపారాలలో కూడా పోటీగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనంతపురంలో తాము తప్ప మరెవరు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి వీలులేదనేట్టుగా వార్నింగ్ ఇచ్చారు జెసి ప్రభాకర్ రెడ్డి. అయితే జెసి ప్రభాకర్ రెడ్డి మాటలు లెక్కచేయకుండా తమవారికి అండగా నిలిచారు దగ్గుబాటి వెంకట ప్రసాద్.
అటు మొత్తం మీద జేసీ పక్షం నుంచి 100కు పైగా దరఖాస్తులు రాగా, దగ్గుబాటి నుంచి 86 దరఖాస్తులు వచ్చాయట.. ముఖ్యంగా వీరందరూ కూడా వారి అనుచరులు బినామీలే వేసినట్లుగా సమాచారం.. అయితే తాజాగా జరిగిన లాటరీలో ఇద్దరికీ కూడా భారీ సంఖ్యలో షాపులు లభించాయట.. దగ్గుబాటి అనుచరులకు 22 రాగా, జెసి వర్గానికి కూడా 22 వచ్చినట్లు సమాచారం. అయితే ఇలా మద్యం షాపులను దక్కించుకున్న వారిలో కొంతమందిని అటు జేసి, ఇటు దగ్గుబాటి ఇద్దరు కూడా వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి.