జార్ఖండ్ లో ఎన్నికల వాతావరణం కాక పుట్టిస్తోంది. అక్కడ అధికారక జేఎంఎం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతుండగా.. బీజేపీ కూడా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సోషల మీడియా వేదికగా ఆయా పార్టీలు ప్రచార పర్వాన్ని హెరెత్తిస్తున్నాయి. సంక్షేమంపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి.
ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వస్తే 18 ఏళ్లు పైబడిన అర్హులైన మహిళలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ లోయ కూడా మహిళలను ఆకట్టుకునేందుకు పలు మహిళా పథకాలతో పార్టీలు ముందుకొస్తున్నాయి. అధికారిక జేఎంఎం పార్టీ మైయా సమ్మాన్ యోజన పథకాన్ని తమ ప్రచారాస్త్రంగా వినియోగిస్తోంది. ఈ పథకాన్ని ఓటర్లలోకి బలంగా తీసుకెళ్తుంది.
ఈ బాధ్యతను సీఎం హేమంత్ సోరెన్ సతీమణి గండి ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తీసుకున్నారు. సంక్షేమ పథకంలో భాగంగా ఆగస్టులో మహిళల కోసం మైయా సమ్మాన్ యోజన పథకాన్ని ప్రారంభించారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న అర్హులైన మహిళలకు నెలకు రూ.2500 చొప్పున హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఇస్తోంది. అంతకుముందు రూ.1000 ఉండగా.. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మరో రూ.1500 పెంచి మొత్తం రూ.1500 ఇచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
అయితే ఈ పథకం గురించి ప్రజలకు నేరుగా అవగాహన కల్పించేందుకు నేరుగా రంగంలోకి దిగారు సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్. అయితే ఇది బీజేపీ చేపట్టిన పరివర్తనా యాత్రకు కౌంటర్ అని జేఎంఎం వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అక్టోబరు 2న హజారీబాగ్ లో ముగిసిన బీజేపీ పరివర్తనా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీజేపీ కూడా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గోగో దీదీ యోజన పథకం ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం అర్హులైన మహిళలకు రూ.2100 చొప్పున ఇస్తారు. మొత్తానికి అయితే ఏపీ పథకాలకు పొరుగు రాష్ట్రాల్లో మాత్రం క్రేజ్ కనిపిస్తోంది.