సంపద సృష్టి ఈ మాట ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు జోరుగా వినిపించన మాట. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాం అంటే కొంతమంది ఎలా చేస్తారు అని ప్రశ్నించారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం.. అమలు చేస్తాం. సంపద సృష్టిస్తాం… దానిని అందరికీ పంచుతాం అప్పుడు అన్నీ అమలు అవుతాయి అని ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు చెప్పిన మాట.


దీంతో సంపద సృష్టి పై తరచుగా కూటమి సర్కారు కు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సంపద సృష్టికి తొలి అడుగు పడినట్టేనా? అంటే టీడీపీ నాయకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. దీనికి కారణం తాజాగా ఏపీలో నూతన మద్యం విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంతో సర్కారుకు కాసుల వర్షం కురసిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే 3396 మద్యం షాపుల కోసం 89882 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా దరఖాస్తుల రుసుంతో రాష్ట్ర ఖజానాకు రూ.1798 కోట్ల ఆదాయం వచ్చింది.


సగటున ఒక్కో దుకాణానికి 26 మంది పోటీ పడ్డారు.  ఈ నెల 16 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు అప్పటికప్పుడు ఆయా ప్రాంతాల వారీగా వ్యాపార లైసెన్సు కు సంబంధించి కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే ఉదాహరణకు.. ఏదైనా కాలేజీలో చేరాలని అనుకుంటే ముందుగా దరఖాస్తు చేసుకొంటాం. తర్వాత సీటు వస్తే కోర్సుకు ఫీజు చెల్లించినట్లుగా ఇప్పుడు మద్యం వ్యాపారులు చెల్లించాలి.


ఈ ధరలు.. ప్రాంతం, జిల్లా, జనాభా బట్టి మారుతూ ఉంటాయి. విశాఖ పట్నం వంటి నగరాల్లో 20 వేల మందికి ఒక బార్ ఉంటే.. 10 వేల మందికి ఒక వైన్ షాప్ ఉంటుంది. ఇక్కడ మద్యం అమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి లైసెన్సు ఫీజుల కింద ప్రభుత్వానికి రూ.2 నుంచి 5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక విజయవాడ, అనంతపురం, గుంటూరు, రాజమండ్రి వంటి జిల్లాల్లో మాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. అక్కడ మరో రెండు కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాలి.  ఇలా మొత్తం 3396 దుకాణాలకు కోట్ల రూపాయల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. సుమారు మరో రూ.3 వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా సంపద సృష్టేనని తమ్ముళ్లు ప్రచారం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn