ఈ సందర్భంగా విజయ డైరీ సిబ్బంది అలాగే ఎండిపోయిన రెచ్చిపోయి మాట్లాడారు. విజయ డైరీలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడం పై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా చైర్మన్ చాంబర్లో... వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం పట్ల కూడా... చాలా సీరియస్ అయ్యారు ఆళ్లగడ్డ టిడిపి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇంకా మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు ఎందుకు పెట్టారు అని వాటిని తొలగించాలని ఆమె ఆదేశించారు.
ముఖ్యంగా... జగన్మోహన్ రెడ్డి ఫోటోను తీసేసి చంద్రబాబు ఫోటోలు ఆమెనే దగ్గరుండి ఏర్పాటు చేయించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ తెరపైకి రాకూడదని అక్కడి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు భూమా అఖిలప్రియ. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శిలాఫల కాలనీ తొలగించి మురికి కాల్వలో పడేసిన వారిని.. అసలు వదిలిపెట్టానని హెచ్చరించారు భూమా అఖిలప్రియ. విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి కి ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఈ సందర్భంగా తన కుర్చీలో.. నువ్వెందుకు కూర్చుంటావు అని అఖిలప్రియ అని జగన్ ప్రశ్నించారట. నీ సిబ్బంది సీట్ల కూర్చోమంటే కూర్చున్నానని ఆమె తెలియజేసింది. తనను అడగకుండా ఇలా కూర్చుంటారని జగన్.. ఇక్కడ తగ్గలేదట. దాంతో రెచ్చిపోయిన అఖిలప్రియ.. మీరు కూడా గతంలో తమ కుర్చీలో కూర్చున్నారని కూడా ఆగ్రహించారు. జగన్ ఫోటోలను తీసివేయాలని.... ఎన్టీఆర్ శిలా ఫలకం పెట్టా లని కూడా.. ఈ సందర్భంగా ఆదేశించారు అఖిలప్రియ.