ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు ఏకమై... బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం చేసింది ఈ తెలుగుదేశం కూటమి. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... మంత్రి పదవులను అలాగే నామినేటెడ్ పోస్టులను ఇప్పటికే చంద్రబాబు నాయుడు భర్తీ చేశారు.


ఈ పోస్టుల భర్తీలలో మొదటి నుంచి జనసేన పార్టీకి అన్యాయం జరుగుతోందని కొంత ప్రచారం జరుగుతోంది.పవన్ కళ్యాణ్ కు హోమ్ మినిస్టర్ ఇవ్వకుండా.. డిప్యూటీ ముఖ్యమంత్రి ఇవ్వడం పై మొదటి నుంచి జనసేన ఆగ్రహంగా ఉంది. అలాగే ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని కూడా మండిపడుతోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు ఇవ్వలేదని కూడా చెబుతోంది జనసేన. అయితే... లేటెస్ట్ గా ప్రభుత్వం ఏర్పాటు అయిన 120 రోజుల తర్వాత.. జిల్లా ఇన్చార్జిలను ప్రకటించింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.

26 జిల్లాలకు గాను... మంత్రులకు బాధ్యతలు ఇచ్చింది. అయితే కొంతమందికి రెండు జిల్లాల చొప్పున... బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పదవి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ కు కూడా ఇన్చార్జి పదవి ఇవ్వలేదు చంద్రబాబు. అయితే పవన్ కళ్యాణ్ కు ఇటు నారా లోకేష్ కు ఇన్చార్జి పదవులు ఎందుకు ఇవ్వలేదని.... కొత్త చర్చ జరుగుతోంది.

 నారా లోకేష్ కు ఇన్చార్జి పదవి ఇచ్చి  పవన్ కళ్యాణ్ కు ఇవ్వకపోతే... లోకేష్ పరువు పోయే ఛాన్స్ ఉంది. ఒక స్టేట్ లీడర్ కు ఈ జిల్లా ఇన్చార్జి పదవి ఇస్తే... నారా లోకేష్ పొలిటికల్ కెరీర్ దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు భావించారట. అందుకే నారా లోకేష్ కు ఆ పదవి ఇవ్వకుండా... ఈ స్కెచ్ వేశారట. ఇద్దరికీ ఇన్చార్జ్ పదవులు ఇవ్వకపోతే... నారా లోకేష్ ను కాపాడుకోవచ్చు అని చంద్రబాబు ప్లాన్ వేసినప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు ఈ అంశం జనసేన పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: