పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ముఖ్య కారణం వర్మనే అని చెప్పవచ్చు.. వర్మ అక్కడ తప్పుకోవడం వల్ల కూటమికి అనుకూలించడం వల్ల పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే అలా గెలిచినప్పటి నుంచి చాలామంది జనసేన పార్టీ నేతలు చేస్తున్న ఓవరాక్షన్ పనుల వల్ల టిడిపి నేతలు తమ వైభోగం అంతా కూడా అంతరించిపోతోంది అంటూ వారు మాతో మొరపెట్టుకుంటున్నారట. టిడిపి అడ్డ అంటే పిఠాపురం అనేట్టుగా ఉన్న వర్మ అది గతంలో అనేలా ఎప్పుడు మారిపోయింది.



అయితే వర్మ తరపు నుంచి ఒక వర్గం వారు నూటికి 80% వరకు ఉన్నారట అక్కడ వర్మ తప్ప మరెవరైనా నిలబడిన కూడా ఓడించే పరిస్థితి ఉంటుందట. వీరంతా వర్మ చెప్పిన పని చేస్తూ ఉంటారట. అలా 2014లో ఇండిపెండెంట్గా గెలిచి మంచి విజయాన్ని అందుకున్నారు వర్మ దీంతో అతని గొప్పతనం ఏందో చెప్పాల్సిన పని లేదు. ఇక 2024లో టిడిపి నుంచి పోటీ చేయగా కచ్చితంగా గెలుస్తారు అనుకుంటున్న సమయంలో చివరి నిమిషంలో కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా వర్మ ఈ సీటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇవ్వడం జరిగింది.


అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఈ సీట్ ని తన సొంత సీటుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. వచ్చే ఎన్నికలలో నూరు శాతం మళ్ళీ అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఒకవేళ ఆయన కాకపోయినా జనసేన నుంచి ఎవరో ఒకరు కీలకమైన నేతని రిఫర్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక దీన్ని బట్టి చూస్తే పిఠాపురంలో కచ్చితంగా జనసేన-టిడిపి మధ్య గట్టివార్ కొనసాగుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులో కూడా కూటమిలో భాగంగా పొత్తు కుదరకపోగా విడివిడిగా పోటీ చేయగా ఇందులో జనసేన నాలుగు డైరెక్టర్లను గెలుచుకోగా.. ఇండిపెండెంట్ కి ఒకటి దక్కింది. దీంతో అక్కడ టిడిపికి చాలా ఇబ్బందులు అయినట్లుగా వర్మ అనుచరులు ఓడిపోయారనే విధంగా చేస్తున్నారట. దీంతో వర్మ అనుచరులు కూడా కాస్త జనసేన పార్టీ మీద కోపంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వర్మ కూడా గౌరవం దక్కలేదని పలువురు టిడిపి నేతలు కూడా వాపోతున్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా కూటమి విచ్ఛిన్నమవుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: