అందుకే ప్రజలు ట్రాక్టర్లు, ఎద్దుల బండల్లో ఇసుక తీసుకు వెళ్లే వాళ్ల మీద ఎవరు కూడా కేసులు పెట్టవద్దండి అంటూ తెలుపుతున్నారు. ఎడ్ల బండితో ఇసుక తీసుకువెళ్లే గ్రామస్తులపైన రైతుల మీద కానీ ఎవరైనా పెత్తనం చెలాయిస్తే సహించేది లేదు అంటూ సూచించారట. ముఖ్యంగా ఆడవాళ్ళ పైన జరుగుతున్న అత్యాచారానికి అల్లర్లకి అన్నిటికీ కారణం వైసీపీ ప్రభుత్వమే అంటూ ఆరోపించారు. రాష్ట్రాలలో వీధిలైట్లు అన్ని వెలగాలి అధికారులు కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధగా పనిచేయాలి అని తెలిపారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి తవ్వే కొద్ది బయటికి వస్తోంది అంటూ తెలిపారు సీఎం చంద్రబాబు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం .. రాష్ట్రంలో అల్లర్ల అరాచకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఇకమీదట ఇలాంటివి జరగకూడదు అంటూ హెచ్చరించారు.. రాష్ట్రంలో చెత్త పనులు విధించిన గత ప్రభుత్వం వాటిని కూడా ఇప్పుడు తీసేసామంటూ తెలియజేశారు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గుంతలు పడిపోయాయి వీటిని పూడ్చడానికే సుమారుగా 600 కోట్లు అవుతుంది వచ్చే నెల ఒకటి నుంచి అన్నిటిని పూజ చేస్తామంటూ తెలిపారు సీఎం చంద్రబాబు.. ఇక ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి ,విశాఖ మనకు ఆర్థిక రాజధాని అంటూ తెలియజేశారు. అలాగే కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటూ తెలిపారు. అన్ని సిటీలను కూడా ఇండస్ట్రియల్ హబ్బుగా మార్చేస్తామంటూ తెలిపారు . అన్ని కులాల వారికి రాబోయే రోజుల్లో భవిష్యత్తు కోసం ప్రత్యేక కార్పొరేషన్లు తీసుకువస్తామని తెలిపారు. ప్రపంచమంతా మన వైపే చూసేలా అభివృద్ధి చేస్తానంటే తెలిపారు సీఎం చంద్రబాబు.