ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మోడీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. మోడీ కూటమిలో కీలకంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సెక్యూరిటీని తగ్గించనున్నారట. ఈ మేరకు కేంద్రం అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన... NSG భద్రత... తొలగించబోతున్నారని... జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.


ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందట. అయితే నారా చంద్రబాబు నాయుడు ఒక్కడికే కాకుండా... ఎన్ ఎస్ జి భద్రత పొందుతున్న రాజకీయ నాయకులు అందరికీ కూడా... ఇదే పరిస్థితి ఎదురుగానుందట. విఐపి సెక్యూరిటీ విధుల నుంచి.. కౌంటర్ టెర్రరిస్ట్ కమాండో ఫోర్స్ గా ఉన్న ఎన్ ఎస్ జి ని... ఉపసంహరించుకోవాలని.. ఓ నిర్ణయానికి వచ్చిందట మోడీ ప్రభుత్వం.


అయితే ఎన్ ఎస్ జి స్థానంలో.... మరో సరికొత్త సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ భద్రతా సిబ్బందిని తొలగించి... సిఆర్పిఎఫ్  భద్రత మాత్రమే అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. మరో నెల లేదా రెండు నెలల్లోనే... విఐపి లకు ఉన్న ఎన్ ఎస్ జి సెక్యూరిటీని... తొలగించి సిఆర్పిఎఫ్ కు అప్పగిస్తారట. అంటే ఇకపైన నారా చంద్రబాబు నాయుడుకు.. సిఆర్పిఎఫ్ భద్రత మాత్రమే ఉంటుందన్నమాట.


చంద్రబాబు నాయుడుతో పాటు ఈ లిస్టులో... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. బిజెపి కీలక నేత అద్వానీ, రాజనాథ సింగ్  మరియు మాయావతి.. కూడా... సిఆర్పిఎఫ్ భద్రత సిబ్బంది లోకి వస్తారని సమాచారం. వాస్తవంగా 2003 సంవత్సరంలో.. తిరుపతిలోని అలిపిరి దగ్గర నక్సలైట్ దాడి... జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడుకు.. ఎన్ ఎస్ జి రక్షణ కల్పించింది కేంద్రం. అయితే ఇప్పుడు దాన్ని తొలగిస్తున్నారు. మరి దీని పై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: