దీంతో అప్పటినుంచి దువ్వాడ శ్రీనివాస్ అటు మాధురి వ్యవహారం.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికి కూడా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాదిరి వ్యవహారం మీడియాలో నడుస్తూనే ఉంది. ఈ జంటను ప్రతి యూట్యూబ్ ఛానల్... ఇంటర్వ్యూ కూడా చేస్తోంది. ఇక తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనివాసుని పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే ప్రకటించింది మాధురి.
ఇందులో భాగంగానే మొన్న తిరుమలకు కూడా ఈ జంట వెళ్లింది.50 ఏళ్లకు పైన ఉన్న దువ్వాడ శ్రీనివాసులు... 30 ఏళ్ల మాధురి పెళ్లి చేసుకోబోతుందన్నమాట. ఏజ్ పెద్ద మ్యాటర్ కాదని కూడా ఈ జంట ఇప్పటికే ప్రకటించింది. తమది.... కామం కాదని ప్రేమ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నారు. ఈ తరుణంలోనే ఓ ఛానల్ ప్రతినిధి... దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురిని ఓ అదిరిపోయే ప్రశ్న అడిగాడు.
దువ్వాడ శ్రీనివాస్ కు వారసుడిని ఇవ్వబోతున్నారా అని.. మాధురిని డైరెక్టుగా ప్రశ్నించాడు ఆ ఛానల్ ప్రతినిధి. అయితే ఈ ప్రశ్న విన్న వెంటనే... మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ సింపుల్గా నవ్వుతూ ఆ ప్రశ్నను దాటేశారు. అంటే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకొని వారసుడిని కూడా కనబడుతున్నారని.... సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. ఇది ఇలా ఉండగా... దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ నేపథ్యంలో... మాధురికి మొన్న యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.