అదేంటి వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల ఎన్నికలకు ముందు తన సొంత అన్నను ఓడించాలని కంకణం కట్టుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికలలో ఏ అన్నను అయితే గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్రం అంతటా పర్యటించారో.. అదే షర్మిల ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి.. అన్న జగన్‌ను ఓడించాలని కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. అలాంటి షర్మిల ఎన్నికల ముగిసిన నాలుగు నెలలకే కనిపించడం లేదు. షర్మిల కనిపించకపోవడం ఏంటని..? అనుకుంటున్నారా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో అవుననే సమాధానం అనిపిస్తుంది. ఎన్నికలకు ముందు నుంచి మూడు నాలుగు నెలల పాటు షర్మిలకు ప్రధాన మీడియా అంతా భారీ కవరేజ్ ఇచ్చేది.


షర్మిల ఏం మాట్లాడితే అది వార్త అన్నట్టుగా ఉండేది. గత నెల రోజుల నుంచి షర్మిలకు ప్రధాన మీడియా ప్రాధాన్యం తగ్గించేసింది. ఒకప్పుడు షర్మిల ఆర్టికల్స్ అంటే బ్యానర్ ఐటెంలో ఫస్ట్ పేజీ ఐటమ్‌లాగా ఉండేవి. చాలా గొప్పగా హైలైట్ చేసేవారు. అయితే గత నెల రోజుల నుంచి షర్మిల ఎక్కడ మాట్లాడినా.. ఏం మాట్లాడినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిన్న, మొన్నటి వరకు కనీసం ఆమె వార్తలు లోపల పేజీలలో అయినా ఎక్కడో ఒకచోట చిన్న ఫోటోతో సహా కనిపించేవి. కానీ రాను.. రాను.. తెలుగులో ప్రధాన మీడియా మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీడియా షర్మిలకు ప్రాధాన్యం తగ్గించేసింది.


షర్మిల బయటకు రావటం లేదా..? సోషల్ మీడియాలో స్పందించడం లేదా..? అంటే స్పందిస్తున్నారు. కానీ.. ఆమెకు మైలేజీ రావటం లేదు. మీడియా కూడా పట్టించుకోవడం లేదు. షర్మిల.. జగన్‌ను తిట్టకపోవడం, వైసీపీపై దూకుడు తగ్గించడం వంటి కారణాలతో పాటు.. ఆమె మాటల్లో అంతగా పస లేకపోవడం వల్లే మీడియా ఆమెకు ప్రాధాన్యం తగ్గించేసింది అని అంటున్నారు. ఇక షర్మిల గత నెల రోజుల నుంచి కూట‌మి సర్కారుపై నిష్టంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.


వరద సాయంతో పాటు.. ఇతర వ్య‌వ‌హార‌ల‌పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో జగన్‌ను ఎలా అయితే ఆమె నిలదీశారో.. ఇప్పుడు చంద్రబాబును కూడా అలాగే నిలదీస్తున్నారు. ఇలా రకరకాల కారణాలతో షర్మిలకు తెలుగు మీడియాలో ప్రాధాన్యం తగ్గడంతో.. ఆమె అడ్రస్ ఎక్కడ అని చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: