ఈ విషయాన్ని ఎవరు గమనించడం లేదు. గత ఎన్నికలకు ముందు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసేసారు. కొందరిని జిల్లాలు దాటించేశారు. కుండమార్పిల్లు చేసి పడేశారు. అయితే ఇప్పుడు జగన్ ఎంత మంది నేతలు బయటకు పోతున్నా.. వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆళ్ల నాని బయటకు వెళ్లిన వెంటనే.. మామిడిపల్లి జయప్రకాష్ కు ఏలూరు ఇన్చార్జి పగ్గాలు ఇచ్చేశారు. సంతనూతలపాడులో పోటీ చేసి ఓడిపోయిన మేరుగ నాగార్జునకు తిరిగి వేమూరు పగ్గాలు అప్పగించారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌కు విజయవాడ వెస్ట్ పగ్గాలు ఇవ్వగా.. విజయవాడ సెంట్రల్ పగ్గాలను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఇచ్చేశారు.
సామినేని ఉదయభాను పార్టీ మారారో లేదో.. వెంటనే జగ్గయ్యపేట పగ్గాలను తన్నీరు నాగేశ్వరరావుకి ఇచ్చారు. పెనమలూరు బాధ్యతలు కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవభక్తిని చక్రవర్తికి ఇచ్చారు. ఒంగోలులో బాలినేని పార్టీ మారారో లేదో.. అక్కడ బాధ్యతలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. మంగళగిరి బాధ్యతలను వేమారెడ్డికి అప్పగించారు. ఇలా ఎక్కడ ఏ నియోజకవర్గం ఖాళీ అవుతున్నా.. అక్కడ వెంటనే ఎవరో ఒక నేతకు బాధ్యతలు ఇస్తూ జగన్ క్షేత్రస్థాయిలో ఎప్పటినుంచే పార్టీని పికప్ చేసుకునేందుకు తనదైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయంలో జగన్ జడ్ రాకెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతున్న విషయాన్ని.. చాలామంది గ్రహించడం లేదు.