విశాఖ స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానందుకు కూటమి ప్రభుత్వంలోను మంచి పలుకుబడి కనిపిస్తుంది. ఆయన గత ప్రభుత్వంలో అప్పనంగా కొట్టేసిన భూములన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందేమో అనుకుంటే అలాంటిదేమీ ఇక్కడ కనిపించడం లేదు.. ఆయనకు మంత్రుల సపోర్ట్ ఉందనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఇక దీనికి కారణం ఆయనకు విశాఖలో జగన్ కేటాయించిన అత్యంత విలువైన భూముల రద్దు ఫైల్ ముందుకు కదలటం లేదు.


జగన్ కేసీఆర్ కు రాజ్య గురువుగా వ్యవహరించిన స్వరూపానంద వారు అధికారులు ఉన్నప్పుడు దండుగానే భూములు తెచ్చుకున్నారు. బంగారు భూముగా చెప్పుకునే కోకాపేట్ లో రెండు ఎకరాలు కేసీఆర్ ఆయనకు రాసిచ్చారు. అలాగే జగన్ విశాఖలో ఓ కొండని కూడా ఈయనకు రాసిచ్చారు. అయితే ఆ కొండ విలువ సుమారు 200 కోట్లకు పైనే ఉంటుంది. కేవలం దాన్ని ఆధ్యాత్మిక అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలని ప్రభుత్వం పెట్టిన నిబంధన.. కానీ వ్యాపారం నికి దానికి తగినట్లుగా నిబంధనలు మార్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. ఈలోపు ఎన్నికలు వచ్చాయి ప్రభుత్వం కూడా మారిపోయింది.


అయితే గ‌త‌ ప్రభుత్వం అవసరం లేకపోయినా విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూములన్ని రద్దు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అమేర‌కు ఫైల్ కూడా రెడీ అయింది.. కానీ రెండు నెలల నుంచి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇప్పుడు తాజాగా ఓ ఉన్నతాధికారి ఆ ఫైల్ ను వెనక్కి పంపారని కూడా అంటున్నారు. ప్రభుత్వంలోని ఒకీలక మంత్రి భూములు కేటాయింపును రద్దు చేయకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి  దొంగ స్వామీజీ లాంటి వారికి ప్రోత్సాహం ఇస్తే పాముకు పాలు  పోసినట్లేనని.. వెంటనే ఆ భూములు రద్దు చేసి శారదాపీఠం ద్వారా కబ్జా చేసిన భూములు, తిరుమలలో చేసిన ఉల్లంఘనాలపై చర్యలు తీసుకోవాలని నేరుగాా సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు కొంతమంది టిడిపి , జనసేన నాయ‌కులు రెడీ అయినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: