మన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావులు కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి... పసుపు కండువా కప్పుకున్నారు. ఇలా వరుసగా ఒక్కొక్క నేత బయటకు వెళ్ళిపోతున్నారు. వైసీపీని వీడిన నేతలు తెలుగుదేశం కూటమిలో ఉన్న ఏదో ఒక పార్టీని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో బొత్స సత్యనారాయణ ను మించిన వారు ఎవరు లేరు.
పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించి... పార్టీలు మారడంలో బొత్స సత్యనారాయణను మించిన వారు ఎవరు లేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన బొత్స... ఇప్పుడు మళ్లీ పార్టీ మారెందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అతి త్వరలోనే జనసేన పార్టీలోకి బొత్స సత్యనారాయణ వెళ్ళనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి తగ్గట్టుగానే తాజాగా ఒక ఇన్సిడెంట్ కూడా ఈ వార్తకు బలాన్ని చేకూర్చింది.
తన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోను బొత్స సత్యనారాయణ పెట్టుకున్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసిపి పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ... జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోవడంతో... అందరూ జనసేనలోకి ఆయన వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ తో పాటు మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జారుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ వార్తలు అయితే ప్రచారం అవుతున్నాయి.