వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టానుసారం కామెంట్లు చేయడం, అరాచకాలు, అక్రమాలకు పాల్పడటం చేసిన బోరుగడ్డ అనిల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2021 సంవత్సరంలో బోరుగడ్డ అనిల్ అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాబూ ప్రకాష్ అనే వ్యక్తిని బెదిరించడం జరిగింది. అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు 13 రోజుల పాటు రిమాండ్ విధించింది.
పోలీసుల ప్రశ్నలకు అనిల్ స్పందిస్తూ కొందరు వైసీపీ నేతల ఒత్తిడి, ప్రోద్బలం వల్లే అప్పట్లో అలా వ్యవహరించానని చెప్పారని భోగట్టా. నాయకుడిగా ఎదగడానికి ఛాన్స్ ఉందని వాళ్లు చెప్పిన మాటలు నమ్మి తాను దూకుడిగా వ్యవహరించానని బోరుగడ్డ అనిల్ పోలీసుల విచారణలో చెప్పారని సమాచారం అందుతోంది. ఇకపై మాత్రం తాను అలా వ్యవహరించబోనని అనిల్ తేల్చి చెప్పినట్టు సమాచారం.
వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒకరు తనకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం వల్ల తాను రెచ్చిపోయానని అనిల్ వెల్లడించారు. అయితే తనకు హామీ ఇచ్చిన వ్యక్తి పార్టీ మారడం వల్ల నా భవిష్యత్తు ఇబ్బందుల్లో పడిందని అనిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అనిల్ పై కేసులు ఉండగా అన్ని ఠాణాలకు ఆయనకు సంబంధించిన సమాచారం పంపినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ వివాదంలో పీకల్లోతు కూరుకుపోయారని ఆయన ఈ వివాదం నుంచి బయటపడే అవకాశాలు అయితే దాదాపుగా లేనట్టేనని సమాచారం అందుతుండటం కొసమెరుపు.