ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. అమెరికాతో చైనా ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతోపాటు.. తీవ్ర ఘర్షణ వాతావరణం కూడా తలెత్తింది. ట్రంప్ కొన్ని విషయాలలో చైనాపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. అయితే బయట నేతృత్వంలో చైనా పట్ల అమెరికా విధానం స్థిరంగా కొనసాగుతూ వస్తోంది. ఇరుదేశాల నేతలు భేటీ అవుతున్నారు. ఇక కమల గెలవాలా.. ట్రంప్ గెలవాలా అనే విషయంలో చైనా ఎందుకు కమలవైపు మొగ్గు చూపుతుంది.. అనేదానిపై అంతర్జాతీయ మీడియాలో చాలా కథనాలు వినిపిస్తున్నాయి.
కరోనా మహమ్మారి చైనా నుంచి పుట్టుకొచ్చిందని.. అప్పట్లో ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. అక్కడితో ఆగిన ట్రంప్.. చైనా నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా సుంఖాలు విధించారు. ఇప్పుడు బయట అధ్యక్షుడిగా ఉన్న ఆవే సుంఖాలన్ని కొనసాగిస్తున్నారు. మరోసారి అధికారం చేపడితే చైనా నుంచి వస్తువులపై మరింత సుంఖాన్ని విధిస్తామని ట్రంప్ చెప్పారు. ఇదే డ్రాగన్ ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ కంటే కమల విజయం సాధిస్తే తమకు కలిసి వస్తుందన్న ఆశలతో ఉంది. మరి అమెరికా ఓటరు తీర్పు ఎలా ఉంటుందో తుది ఫలితం వరకు వేచి చూడాలి.