అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే.. బీదా మస్తాన్‌రావు సైతం ఎంపీ పదవి వదులుకొని మరి.. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక జగన్‌కు వరుసకు మామ అయ్యే మాజీ మంత్రి ఆ పార్టీలో ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం షాక్ ఇచ్చి జనసేనలో చేరిపోయారు. ఇప్పటికే పలువురు పార్టీని విడగా.. తాజాగా మరి కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే వైసీపీ నేతలను చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దగా సముఖంగా లేదు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా.. లోకేష్ మాత్రం వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకునేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వారు రెండో ఆప్షన్‌గా జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. జనసేనకు చాలా జిల్లాలు.. చాలా నియోజకవర్గాలలో.. నాయకత్వం కొరత ఉంది. ఈ క్రమంలోనే వైసీపీలో కీలక నేతలుగా ఉన్నవారు సీనియర్ నేతలను జనసేనలో చేర్చుకునే ఆలోచనలు పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పలువురు వైసీపీ నేతలు ఇప్పుడు జనసేనలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.